For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బావర్చీ హోటల్‌ మూసివేత!

By girish
|

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న బావర్చీ హోటల్‌లో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించనందున హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్‌లో వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చే మిషన్‌ను ఏర్పాటు చేయనందున చర్యలు తీసుకున్నట్లు అదికారులు తెలిపారు. మూడేళ్లుగా నోటీసులు ఇస్తున్నా హోటల్ యాజమాన్యం పట్టించుకోలేదని అందుకే యాక్షన్ తీసుకున్నామని వివరించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది బావర్చీ బిర్యానీ. వీకెండ్ అయినా.. వీక్ డేస్ అయినా క్రాస్ రోడ్స్‌లో సినిమా చూసిన తర్వాత ఓ ప్లేట్ బావర్చీ బిర్యానీ లాగించటం హైదరాబాదీలకు అలవాటు. బావర్చీ బిర్యానీ తినటానికే చాలామంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు వెళ్లేవారు. టేస్ట్ అలా ఉంటుంది. రుచిలోనే కాదు ధర, క్వాంటిటీలో కస్టమర్ శాటిస్‌ఫ్యాక్షన్ అలాంటిది. ఎంతో పేరున్న క్రాస్ రోడ్స్ బావర్చీ హోటల్‌లో శుభ్రత అనేది లేదని చెబుతోంది జీహెచ్ఎంసీ. వేస్ట్ మేనేజ్‌మెంట్ మెషీన్ ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సీరియస్ అయ్యింది. 2019, జనవరి 7వ తేదీ సోమవారం ఏకంగా హోటల్ సీజ్ చేసి సంచలనం కలిగించారు జీహెచ్ఎంసీ అధికారులు. మూడేళ్లుగా నోటీసులు ఇస్తున్నా పట్టించుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బావర్చీ హోటల్‌ మూసివేత!

2019, జనవరి 6వ తేదీ ఆదివారం కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్లలో నాలుగు హోటళ్లను సీజ్ చేసిన అధికారులు 2019, జనవరి 7వ తేదీ సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చీ హోటల్‌ను సీజ్ చేశారు. ఈ హోటల్‌లోని వేస్ట్‌ను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకి తరలిస్తున్నారు. దాన్ని క్లీన్ చేయడం జీహెచ్ఎంసీకి పెద్ద సమస్యగా మారింది. ఎక్కడైతే వేస్ట్ ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని కంపోజ్ చేయాలని అధికారులు కోరుతున్నారు. అయినా బావర్చీ హోటల్ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో చర్యలు తీసుకున్నారు మూలం:10 టీవీ.

Read more about: business
English summary

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బావర్చీ హోటల్‌ మూసివేత! | Bawarchi Hotel Rtc x Roads Hyderabad

The GHMC and Waterworks officers checked into the Bawarchi Hotel in RTC Cross Roads. The hotel was sealed by the rules. It is said that steps have been taken because the machine does not set up a compost into the hotel. Hotel owners are not aware of the notices being given three years and hence action has been taken.
Story first published: Tuesday, January 8, 2019, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X