ప్రస్తుతం నగరిలో ఎమ్మెల్యే రోజా ఏమి చేస్తోందో తెలుసా?
మనందరికీ తెలిసిన జబర్దస్త్ ఫేమ్ మరియు ప్రస్తుత వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఇక ఈమె వైస్సార్సీపీ లో జగన్ తర్వాత రెండో స్థాయి నాయకురాలిగా ఈమె పోరాడుతున్నారు. ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాలలోనే కాదు దేశ రాజకీయాలలో కూడా తనదైన శైలిలో పేరు తెచ్చుకున్నారు.

రోజా:
రాజకీయాలలో తలపండిన నేతలు ముద్దు కృష్ణమనాయుడు మరియు చెంగ రెడ్డి లాంటి వారిని ఎదురుకొని రోజా ఎమ్మెల్యేగా గెలిచారు . ఇక ఈమె ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అధికార పార్టీలకు దడ పుట్టించారు. తనదైన శైలిలో రాణిస్తూ వస్తున్నారు.

చంద్రబాబు నాయుడు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి అయన తనయుడు నారా లోకేష్ వరకు క్యాబినెట్ లో ఉన్న అందరు మంత్రులపైనా తనదైన శైలిలో విమర్శల వర్షం గుపిస్తుంటారు. ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం లేదు అని ఇక నియోజకవర్గంలో ఎలా అబ్జివృధి సాగించాలి అని ప్రశ్నలు వేసేవారు.

నగిరి నియోగకావరంలో:
అయితే చివరికి తన సొంత డబ్బుతో నగిరి నియోగకావరంలో అభివృద్ధి కారిక్రమాలలో పాల్గొంటూవస్తున్నారు.తాజాగా కేవలం రూ.4 కే పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే కారిక్రమం మొదలు పెట్టారు. ఈ కారిక్రమం నగరి నియోజకవర్గం మొత్తం జరుగుతోంది.

రూ.2 కే:
నగిరి నియోగకవర్గంలో కేవలం రూ.4 కే కడుపునిండా భోజనం పెట్టడంతో పాటు తాజగా కేవలం రూ.2 కే 20 లీటర్ల తాగునీరు అందించేందుకు వాటర్ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. ఎక్కడైతే ప్రజలు నీరు కోసం కష్టపడుతున్నారో అక్కడికి వెళ్లి వారికీ బాసటగా నిలుస్తున్నారు.

ఎక్కడ సమస్య వచ్చిన:
ఇప్పుడు నగరిలో ఎక్కడ సమస్య వచ్చిన రోజా గారి కోసం ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఇక ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు ప్రభుత్వం కలిపించడం లేదు అని అటువంటిది రోజా ప్రతిపక్షంలో ఉండి కూడా తమ కోసం సొంత నిధులు ఖర్చుపెడుతుండడం పై నగరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు లేదా జగన్:
వచ్చేది జగన్ అన్న రాజ్యం అని రాష్ట్రంలో ప్రజలందరికి మంచి రోజులు రాబోతున్నాయి అని ప్రస్తుత నగరి ఎమ్మెల్యే రోజా అంటున్నారు ఐతే ప్రజలు 2019 లో చంద్రబాబు నాయుడు లేదా జగన్ ఎవరికీ పట్టం కడతారో చూడాలి.


Click it and Unblock the Notifications