నేడు మరోసారి తగ్గిన పెట్రోల్ ధరలు.ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం మరోసారి తగ్గాయి.పెట్రోల్ పై 15-16 పైసలు తగ్గింది అలాగే డీజిల్ పై 18-20 పైసలు తగ్గింది.
పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం మరోసారి తగ్గాయి.పెట్రోల్ పై 15-16 పైసలు తగ్గింది అలాగే డీజిల్ పై 18-20 పైసలు తగ్గింది.లీటరు పెట్రోలు ప్రస్తుతం ఢిల్లీలో రూ. 68.29 వద్ద రిటైల్ అవుతుండగా డీజిల్ రూ.62.26 రూపాయలకు విక్రయిన్చబడుతున్నాయి. ఇంధన ధరల పట్టిక ప్రకారం, అక్టోబరు 2017 నుంచి పెట్రోలు ప్రస్తుతం అత్యల్ప స్థాయిలో ఉందని పేర్కొంది.

ముంబయిలో పెట్రోలు ధర రూ.74 రూపాయల దిగువకు పడిపోయింది ప్రస్తుతం లీటర్ రూ. 73.95 వద్ద రిటైలింగ్ అవుతోంది అలాగే డీజిల్ ధర రూ. 65.14 రూపాయలుగా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 70.85 వద్ద ఉంది, డీజిల్ 65.72 రూపాయల వద్ద ఉంది. కోల్కతాలో కూడా పెట్రోల్ చవకగా ఉన్నది - పెట్రోలు లీటరు రూ.70.43 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ ధర రూ. 64.03 వద్ద ఉంది.
కర్ణాటకలో కాంగ్రెస్-జెడిఎస్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విక్రయిన్చే ఇంధనంపై పన్నులు పెంచింది. గత మూడు నెలల్లో ముడి చమురు ధరలు తగ్గడంతో రాష్ట్రంలో పన్నుల తగ్గింపు ప్రతికూల ప్రభావంతో డీజిల్ పై 21 శాతం మరియు అలాగే పెట్రోలుపై ప్రభుత్వ పన్ను 32 శాతం పెంచింది.శనివారం నాడు పెట్రోలు లీటరు రూ.70.53 రూపాయలు, డీజిల్ ధర రూ. 64.30. పెట్రోల్ పై 1.52 రూపాయలు పెంచింది అలాగే డీజిల్ ధర రూ. 1.50 రూపాయలు పెరిగింది.
పెట్రోలు మరియు డీజిల్ రిటైల్ విక్రయ ధర బెంచ్మార్క్ ఇంధనం యొక్క అంతర్జాతీయ ధరలపై ఆధారపడి ఉంటుంది మరియు రూపాయి-అమెరికా డాలర్ మారకం రేటు పై ఆధారపడి ఉంటుంది.ఎందుకంటే దేశం యొక్క అవసరానికి పెద్ద ఎత్తున ముడి దిగుమతులు చేస్తోంది.
యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా మధ్య ప్రతిపాదిత వాణిజ్య చర్చలు గ్లోబల్ ఆర్ధిక మాంద్యం గురించి కొన్ని భయాలు తగ్గించడంతో ఆయిల్ శుక్రవారం దాదాపు 2% పెరిగింది.
వారాంతంలో బ్రెంట్ 9.3 శాతం పెరిగింది అలాగే WTI 5.8 శాతం పెరిగింది.బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం బ్యారెల్కు $ 57.41 వద్ద 3.61 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications