For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకి SBI బంపర్ ఆఫర్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

By girish
|

రాష్ట్రప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలలో పని చేస్తున ఉద్యోగులకి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఒక తీపి కబురు అందించింది. SBI అకౌంట్ నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగుల అందరి అకౌంట్లను స్టేట్ గవర్నమెంట్ శ్యాలరీ ప్యాకేజ్(SGSP )గా పరిగణించనున్నారు.

ఆదేశాలు జారీ:

ఆదేశాలు జారీ:

ప్రస్తుతం వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఈ ప్యాకేజీకి మారితే పలు ప్రయోజనాలు పొందనున్నారు. ఈ అకౌంట్ మార్పు గురించి SBI ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలు సామర్లకోటలో SBI మూడు శాఖల మేనేజర్లకి ఇప్పటికే అందాయి.

కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి:

కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి:

దీనివల్ల ఇతర ఖాతాదారుల కంటే మెరుగైన సేవలు రాయితీలు మరియు ఇతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది అని బ్యాంకు ఉన్నత అధికారులు తెలిపారు. ఈ అవకాశం రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే కాకుండా కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కూడా అమలు కానుండడం విశేషం.

 భీమా:

భీమా:

బ్యాంకు అకౌంట్లో నిలువ ఉండాలి అని నిబంధన లేదు ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకొనే విషయంలో కూడా పరిమితులు ఉండవు. వ్యక్తిగత ఋణం తీసుకునేవారు ప్రమాదపు శాత్తు మరణిస్తే రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు భీమా వర్తిస్తుంది. రూ.20 లక్షల భీమాకి ఏడాదికి రూ.1000 రూ.10 లక్షల భీమాకి ఏడాదికి రూ.500 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

 SGSP ఖాతాదారులకు:

SGSP ఖాతాదారులకు:

జీతం ప్యాకేజీ ఖాతాదారులు ఎటువంటి ప్రీమియం చెల్లించనవసరం లేదు. వ్యక్తిగత, విద్య మరియు గృహ రుణాలు తీసుకున్నవారి దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీజు వసూల్ చేస్తారు కానీ SGSP ఖాతాదారులకు రుణాల విషయంలో 50 శాతం రాయితీ ఉంటుంది. లాకర్ చార్జీలతో కూడా 20 శాతం ఉంటుంది.డిడి లకు ఎటువంటి చార్జీలు వసూలు చేయరు.

సేవింగ్ అకౌంట్:

సేవింగ్ అకౌంట్:

సేవింగ్ అకౌంట్ ను రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ శ్యాలరీ అకౌంట్ లోకి మార్చుకునేందుకు ఉద్యోగి గుర్తింపు కార్డు మరియు పాన్ కార్డు అలాగే ఇటీవల తీసుకున్న జీతం బిల్లు, ఆధార్ కార్డు, బ్యాంకు వారు ఇచ్చిన దరఖాస్తు పూర్తి చేసి సదరు ఉద్యోగి సంతకాలు చేసిన సెట్ ను స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బ్రాంచిలో సమర్పించాలి.

ఉద్యోగి పొందే వేతనం:

ఉద్యోగి పొందే వేతనం:

బ్యాంకు అధికారులే రెండు మూడు రోజుల్లో ఖాతాదారుని అకౌంట్ SGSP అకౌంట్ గా మార్పుచేస్తారు. ఆన్ లైన్ అకౌంట్ ఉన్న ఉద్యోగికి సదరు అకౌంట్ స్టేటస్ రిపోర్ట్ మెసేజ్ రూపంలో వస్తుంది. ఉద్యోగి పొందే వేతనం ఆధారంగా వివిధ పేర్లతో SGSP అకౌంట్ కేటాయిస్తారు.

 వేతనం:

వేతనం:

రూ.5000 నుంచి రూ.20000 లోపు వేతనం తీసుకొనే ఉద్యోగులకి సిల్వర్ కార్డులు అలాగే రూ.20000 నుంచి రూ.50000 లోపు వేతనం తీసుకొనే వారికీ గోల్డ్ కార్డులు జారీ చేస్తారు. ఇక రూ.50000 నుంచి రూ.100000 వేతనం తీసుకొనే వారికీ డైమండ్ కార్డులు జారీచేస్తారు. ఇక రూ.1 లక్ష పైన జీతం వచ్చే వారికీ ప్లాటినమ్ కార్డు ఇవ్వాలి అని బ్యాంకు అధికారులు నిర్ణయించారు.

బ్యాంకింగ్ రంగంలో:

బ్యాంకింగ్ రంగంలో:

డైమండ్ కార్డులు అందుబాటులో లేకపోవడంతో వాటి స్థానంలో గోల్డ్ కార్డులు ఇవ్వనున్నారు. బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మాత్రమే ఈ పధకాన్ని అమలు చేయాలి అని నిర్ణయించింది. పైసా ఖర్చు లేకుండా ఉద్యోగులకి సేవలు అందియాలి అని SBI అనుకుంటోంది.ఇక ఉద్యోగులు తమ ఖాతాలను SGSP అకౌంట్ లోకి మార్చడానికి సిద్ధంగా ఉండాలి.

Read more about: sbi
English summary

ఉద్యోగులకి SBI బంపర్ ఆఫర్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు! | SBI Good News to Job Holders

State Bank of India has provided a sweet paper to employees working in different departments belonging to the state government. All accounts of employees who receive salaries from the SBI account will be considered as the State Government Salary Package (SGSP).
Story first published: Friday, January 4, 2019, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X