తెలంగాణ రైతుబంధు పథకం పై కీలక ఆదేశాలు జారీ! ఏంటో మీరే చూడండి.
రైతుబంధు చెక్కుల పంపిణీపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలను జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు చెక్కులను రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రైతుబంధు చెక్కుల పంపిణీ కొనసాగిందని తెలిపింది.

చెక్కుల పంపిణీకి:
చెక్కుల పంపిణీకి ఏలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రైతుబంధు అమలు జరుగుతున్న పథకమని ప్రభుత్వం పేర్కొంది. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రతిష్మాత్మకంగా అమలు చేసిన ఈ రైతు బంధు పథకం దేశానికే దిక్సూచిగా మారుతున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో ఉన్నవారికి పెన్షన్ రావడానికి ఇలా చేయండి.
తెలంగాణలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా ప్రభుత్వం తరపున చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం అమలులో వున్న నిబంధనల ప్రకారం 65 ఏళ్లు నిండిన వారికే ఈ ఆసరా పెన్షన్లు వర్తిస్తుండగా... వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 57 ఏళ్లు నిండిన వారికి కూడా వృద్ధాప్య పెన్షన్లు అందచేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ చేసిన సూచనలు మేరకు తాజాగా అధికారయంత్రాగం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించింది.

ప్రభుత్వం జారీచేసిన:
ఈమేరకు ప్రభుత్వం జారీచేసిన నియమనిబంధనలు, మార్గదర్శకాలు ఇలా వున్నాయి. ఈసారి వయసు నిర్ధారణకు ఓటరుకార్డును ప్రామాణికంగా తీసుకోవడం విశేషం. మిగిలిన ఆసరా పింఛన్ల నిబంధనలు యథాతథంగా ఉంటాయి.

అర్హతలు:
- 57 ఏళ్లు నిండినవారు అర్హులు (1953-1961 మధ్య జన్మించిన వారై ఉండాలి).
- ఓటర్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారణ.
- దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు అనర్హులు (తెల్ల రేషన్ కార్డు కలిగి వుండటం దారిద్ర్యరేఖకు దిగువన వుండటాన్ని సూచిస్తుంది)
- . విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్న వారు ఈ ఆసరా పెన్షన్ పథకానికి అనర్హులు.
- దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండొద్దు.
- దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు పరిమితి దాటొద్దు.
- దరఖాస్తుదారులకు పెద్ద పెద్ద వ్యాపారాలు ( ఆయిల్, రైస్, పెట్రోల్ పంపులు వంటి ఇతర వ్యాపారాలు) ఉండరాదు.
- పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేవారు.. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి వున్న వారు అయ్యుండకూడదు.
- దరఖాస్తుదారులకు భారీ వాహనాలు (హెవీ వెహికిల్స్) ఉండరాదు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు అనర్హులు. లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండరాదు


Click it and Unblock the Notifications