For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సామాన్యులని పెట్రోల్ బంకులు ఎలా మోసం చేస్తాయో తెలుసా? మీరు జాగ్రత్తగా ఉండండి.

By girish
|

పెట్రోల్ మాఫియా పై రాచకొండ పోలీసులు చర్యలు చేపట్టారు. చెర్లపల్లిలోని భారత్ మరియు హెచ్ .పి పెట్రోల్ బంకుల నుంచి పోతున్న పెట్రోల్ ట్యాంకర్ల నుంచి కొంత మంది పెట్రోల్ దొంగలించి అమ్ముతున్నారు. ఈ విషయాన్ని గత నెల 29 తేదీ న హోమ్ మంత్రి మహమ్మద్ అలీ దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు.

పెట్రోల్ మాఫియా:

పెట్రోల్ మాఫియా:

పెట్రోల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇక హోమ్ మంత్రి ఆదేశాలతో రాచకొండ కమిషనర్ రంగంలోకి దిగారు. లభించిన ఆధారాలు పాత నేరస్థులను విచారించి కీలక సమాచారం రాబట్టారు.

దందాలో:

దందాలో:

ఆ ప్రాంతంలో ఈ దందా సాగిస్తున్న ముగ్గురు కీలక వ్యక్తులని అరెస్ట్ చేశారు వారిని విచారిస్తున్న పోలీసులు ఈ దందాలో మరి కొందరిని కూడా ఉన్నట్లు తెలిసుకున్నారు.

నగరంలో:

నగరంలో:

ఇక నగరంలో ఎన్నో పెట్రోల్ బంకులలో ఎన్నో రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ద్రుష్టి సాధించి తగిన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు

కల్తీ:

కల్తీ:

బంకులలో డీజల్ మరియు పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు కొలతలతో అవకతవకలు జరిగిన ఎప్పుడో ఒక్కసారి తప్ప నిరంతరం తనిఖీలు జరపడం లేదు అని ఆరోపణ ఉంది, దానికి తోడు ఇంధనంలో కల్తీ జరుగుతోంది అని ఆరోపిస్తున్నారు.

ఆరోపణలు:

ఆరోపణలు:

కొన్ని బంకులలో పెట్రోల్ కి బదులు ఇతర రసాయనాల వాసన వస్తున్న పట్టించుకొనేవారు లేరు. ఇక మరికొన్నిలో పెట్రోల్ మరియు డీజిల్ లోకి కిరోసిన్ కలుపుతున్నారు. దీనిపై నిఘా పెట్టవలసిన కొలతల శాఖతో పటు పౌరసరఫరాల అధికారులు పిర్యాదులు అందినప్పుడే స్పందిస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి.

పెట్రోల్ ధరలు:

పెట్రోల్ ధరలు:

ఇక గతంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలో ఎప్పుడో మార్పులు కనిపించేవి కానీ ఈరోజుల్లో ప్రతి రోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారుతూనే వస్తున్నాయి. చాలా చోట్ల పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు మాత్రమే అప్పటికప్పుడు పెరిగిన ధర మారుస్తున్నారు కానీ తగ్గినప్పుడు మాత్రం ధర మార్చడం లేదు.యాజమాన్యం ఆదేశంతోనే తగ్గినా రేటు మార్చడం లేదు అని బంక్ సిబ్బంది అంటున్నారు.

 తెలంగాణలోనే కాదు:

తెలంగాణలోనే కాదు:

ఇలాంటి విషయాలపై అధికారులు నిఘా పెట్టి బంకుల యజమానులు ట్రాన్స్పోర్టర్ పై ద్రుష్టి పెడితే అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. కేవలం ఒక్క తెలంగాణలోనే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న సుమారు పెట్రోల్ బంకులలో ఇలాగే జరుగుతున్నాయి అని సమాచారం.

Read more about: petrol
English summary

సామాన్యులని పెట్రోల్ బంకులు ఎలా మోసం చేస్తాయో తెలుసా? మీరు జాగ్రత్తగా ఉండండి. | Petrol Bunk Scams

Rachakonda police have taken action on the petrol mafia. Some petrol stolen from petrol tankers from India and HP petrol bunkers in Cherlapalli. The matter was made on 29th day of the month after the visit to the home minister Mohammed Ali.
Story first published: Friday, January 4, 2019, 14:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X