వరుసగా రెండవ రోజు పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు రూ .68.65 వద్ద విక్రయించగా, డీజిల్ ధర రూ.62.66 రూపాయలకు చేరుకుంది.
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు రూ .68.65 వద్ద విక్రయించగా, డీజిల్ ధర రూ.62.66 రూపాయలకు చేరుకుంది. గత ఏడాది మార్చి నుంచి డీజిల్ ధరలు అత్యల్పంగా ఉండగా పెట్రోలు ఒక్క సంవత్సరంలోనే అతి తక్కువ స్థాయికి చేరిన విషయం గమనించవచ్చు.

నోయిడా మరియు గురుగ్రామ్ లో పెట్రోల్ ధర రూ. 69.93, రూ. 68.90 రూపాయలు అలాగే డీజిల్ ధర రూ.62.89, రూ.62.28 రూపాయల వద్ద ఉంది.
చెన్నై, కొలకత్తా లో పెట్రోల్ ధర రూ.71.22 రూపాయలు,రూ.70.78 రూపాయల చొప్పున అమ్మకాలు జరిగాయి. ఈ నగరాల్లో డీజిల్ రూ.66.14 రూపాయలు, రూ.64.42 రూపాయల మేరకు విక్రయించింది.
ఇంటర్నేషనల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు $ 54.55 వద్ద 36 సెంట్లు లేదా 0.7 శాతం క్షీణించాయి. గురువారం నాడు రూపాయి విలువ తక్కువగా ప్రారంభమై, డాలర్కు వ్యతిరేకంగా 70.38 వద్ద ట్రేడింగ్ జరిగింది. రిటైల్ ఇంధన ధరలు అంతర్జాతీయ ముడి ధరపై, రూపాయి-డాలర్ మారకం రేటుపై ఆధారపడుతున్నాయని గమనించవచ్చు.
అక్టోబరు ప్రారంభంలో పెట్రోలు, డీజిల్ ధరలు 20 శాతం వరకు పడిపోయాయి. ఈ మూడు నెలల్లో ముడి ధరలు దాదాపు 40 శాతం తగ్గాయి. ముడి ధర పతనం దేశానికి లాభదాయకం,ఎందుకంటే దేశంలో 80 శాతం కంటే ఎక్కువ ముడి అవసరాలకు దిగుమతి చేస్తుంది. ఇది దేశ కరెంట్ ఖాతాలోటును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఆర్బిఐ నుండి రెపో రేటును తగ్గించాలన్న ఆశలు పెంచుతుంది.


Click it and Unblock the Notifications