ఈరోజుల్లో ఇంటర్ నెట్ లేకుండా ఒక్క పని కూడా చేయలేము మొత్తం దేశంలో ఉన్న ప్రజలు ఇంటర్ నెట్ వాడకానికి బానిసలు లాగా అయిపోయారు ఒక పక్క ఇంటర్నెట్ నుంచి మంచి జరుగుతుంటే మరో పక్క చెడు చేస్తోంది, ప్రధానంగా యువత దేశంలో ఇంటర్ నెట్ వాడేవారు సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్నారు.

భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు శరవేగంగా పెరిగి పోతోంది. ముఖ్యంగా జియో రాకతో డేటా వినియోగం విషయంలో ఇతర టెలికాం కంపెనీలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. కాగా 2018లో భారత్‌లో ఇంటర్నెట్ కనెక్షన్లు 65 శాతం పెరిగిందని ట్రాయ్ గణాంకాల ద్వారా వెల్లడయింది. అంతేకాదు, ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారిసంఖ్య కూడా 50 కోట్లను దాటిపోయింది. 2018 చివరినాటికి భారత్‌లో నారోబ్యాండ్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 56 కోట్లకు చేరుకున్నాయని ట్రాయ్ పేర్కొంది. ఇందులో 54 కోట్ల మంది మొబైల్ ద్వారానే ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు.
మిగిలిన వాళ్లు బ్రాడ్‌బ్యాండ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక మొత్తం 56 కోట్ల కనెక్షన్లలో 35 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 19.4 కోట్ల మంది గ్రామీణ ప్రాంంతాల్లో ఉన్నారు. కాగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 445.18 మిలియన్ల మంది మొబైల్ ఫోన్లు, డాంగిల్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నారు. మొత్త అయిదు టెలికాం సంస్థలు ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి.
అత్యధికంగా జియో ఇన్ఫోకామ్(252.25 మిలియన్లు) ఉండగా, తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్‌టెల్ (99.29మిలియన్లు), వొడాఫోన్(51.82 మిలియన్లు), ఐడియా సెల్యులార్ (47.90మిలియన్లు), బిఎస్‌ఎన్‌ఎల్ (20.12 మిలియన్లు) ఉన్నాయి. మొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో అత్యధికంగా కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలలో 20 కోట్ల మంది ఉన్నారు


Click it and Unblock the Notifications