న్యూఇయర్ బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్ జియోకి గెట్టి పోటీ!
గత కొన్ని సంవత్సరాల నుంచి టెలికాం రంగంలో ఒక సంచలనం సృష్టించింది ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో, కానీ జియోకి ముందు బీఎస్‌ఎన్‌ఎల్ అందరి ఇష్టమైన నెట్ వర్క్ కానీ బీఎస్‌ఎన్‌ఎల్ ఇచ్చిన ఆఫర్లు చూస్తుంటే మళ్ళీ వినియోగదారులకి దగ్గర అవుతుంది అని అంతానుకుంటున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆఫర్లు తెచ్చింది. వాటి ప్రకారం మొబైల్ యూజర్లు వర్షికా-1699 ప్లాన్ కింద రూ.1,699తో ఏడాదిపాటు అపరిమిత (లోకల్ అండ్ రోమింగ్) వాయిస్‌కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, ఫ్రీ కాలర్‌ట్యూన్, అన్‌లిమిటెడ్ డేటా పొందొచ్చు. డేటా యూసేజ్ రోజుకు 2జీబీ దాటితే, ఆ తర్వాత డేటా స్పీడ్‌ను 80 కేబీపీఎస్‌కు తగ్గిస్తారు. రూ.2,099తో రీచార్జ్ చేసుకునే వర్షికా ప్లస్-2099 ప్లాన్‌కూ ఇవే రూల్స్ వర్తిస్తాయి. కాకపోతే అందులో రోజుకు 4జీబీ వాడాక డేటా వేగాన్ని 80 కేబీపీఎస్‌కు తగ్గిస్తారు.

రూ.300 టాప్‌అప్‌తో రూ.30 అదనపు టాక్‌టైం పొందొచ్చు. గురు, శుక్ర, శనివారాల్లో రూ.250, సోమ, మంగళ, బుధవారాల్లో రూ.500, రూ.600 టాప్‌అప్‌తో 10 శాతం అదనంగా టాక్‌టైం వస్తుంది. కాంబో ఎస్టీవీ-175లో రూ.200, కాంబో ఎస్టీవీ-219లో రూ.250 టాక్‌టైంతో పాటు 0.5జీబీ డేటా 60 రోజుల టైమ్ లిమిట్‌తో ఇస్తున్నారు. కాంబో ఎస్టీవీ-252లో రూ.350 టాక్‌టైం, 2 జీబీ డేటా, కాంబో ఎస్టీవీ-402లో రూ.600 టాక్‌టైం, 4జీబీ డేటా 60 రోజుల కాలపరిమితితో లభిస్తున్నాయి.
తెలంగాణలో బీఎస్ఎన్ఎల్ మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ 487 వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటుచేసింది. మరో 423 హాట్‌స్పాట్‌లను రెండు నెలల్లో సెట్ చెయ్యబోతోంది. వీటి ద్వారా 100 మీటర్లలో 2 నుంచి 10 ఎంబీపీఎస్ వేగంతో రోజుకు 4 జీబీ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు పొందవచ్చు. చక్కటి ఆఫర్లు తెచ్చామన్న సంస్థ ప్రతినిధులు ఈ ఏడాది మరింత మంది యూజర్లు తమవైపు వస్తారని భావిస్తున్నామన్నారు


Click it and Unblock the Notifications