సంక్రాంతి పండుగకి స్పెషల్ రైలు మీరు కూడా చూసుకోండి ఇప్పుడే.
నిన్న నూతన సంవత్సరం వేడుకలు ముగించుకొని అందరు తమతమ పనులలో మునిగిపోయారు కానీ ఇంకా కేవలం 10 రోజులలో పెద్ద పండుగ సంక్రాంతి రానుంది. ఒక సంక్రాంతి అనే కాదు సిటీలలో ఒక సంక్రాంతి పండుగనే కాదు ఏ పండుగ వచ్చిన మొత్తం అంతా తమ సొంత ఊర్లకి వాలిపోప్తారు. దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకొంది ఏంటో మీరే చూడండి.

సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ పండగ సీజన్ లో వేర్వేరు రూట్లలో కలుపుకొని మొత్తం 13 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి పర్వదినం జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రెగ్యులర్ రైళ్లలోని బోగీలన్నీ నిండిపోయారు.ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేక రైళ్ల వివరాలు
- కాకినాడ, సికింద్రాబాద్ మధ్య 7 రైళ్లు
- నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ కు మూడు ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది
- కాకినాడ నుంచి సికింద్రాబాద్ కు 16, 17, 20 తేదీల్లో రెండేసి రైళ్లు 18వ తేదీన ఒకటి
- అలాగే నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య 18, 19, 20 తేదీల్లో ఒక్కోటి
- విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు 17న తేదీ..
- సికింద్రాబాద్ నుంచి కాకినాడకు 13, 20 తేదీల్లో ఒక్కో రైలును నడపనున్నారు.
- కాగా ఈ రైళ్లలో ప్రయాణించే వారి నుంచి ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు


Click it and Unblock the Notifications