For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన జిఎస్టి వసూళ్లు:డిసెంబర్ నెలలో వసూళ్లు పతనం.

డిసెంబర్ 2018 లో జిఎస్టి సేకరణ రూ.94,726 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు నెలలో రూ.97,637 కోట్ల రూపాయలు సేకరించింది.

By bharath
|

న్యూఢిల్లీ: డిసెంబర్ 2018 లో జిఎస్టి సేకరణ రూ.94,726 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు నెలలో రూ.97,637 కోట్ల రూపాయలు సేకరించింది. 2018 డిసెంబర్ 30 నాటికి అమ్మకాల రిటర్న్స్ లేదా GSTR -3B మొత్తం రూ.72.44 లక్షల రూపాయలు దాఖలు చేసిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

తగ్గిన జిఎస్టి వసూళ్లు:డిసెంబర్ నెలలో వసూళ్లు పతనం.

ఆగస్టు-సెప్టెంబర్ వరకు రాష్ట్రాలకు విడుదల చేసిన జిఎస్టి పరిహారం రూ. 11,922 కోట్లు. మొత్తం రూ.94,726 కోట్ల రూపాయల వసూళ్ళలో సెంట్రల్ జిఎస్టి సేకరణ రూ.16,442 కోట్లు మరియు రాష్ట్ర జిఎస్టి సేకరణ రూ.22,459 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి సేకరణ రూ. 47,936 కోట్లు, సెస్ రూ. 7,888 కోట్లు. CGST కు సంబంధించి రూ.18,409 కోట్లు, IGST నుండి SGST కు రూ .14,793 కోట్లు సాధారణ సెటిల్మెంట్గా ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు డిసెంబరులో రెగ్యులర్ సెటిల్మెంట్ తరువాత మొత్తం ఆదాయం CGST కింద రూ. 43,851 కోట్లు, SGST కింద 46,252 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాయి.

జిఎస్టి సేకరణ ఏప్రిల్లో రూ.1.03 లక్షల కోట్ల రూపాయలు, మే నెలలో రూ.94,016 కోట్లు, జూన్ నెలలో రూ.95,610 కోట్లు, జులైలో రూ.96,483 కోట్లు, ఆగస్టులో రూ.93,960 కోట్లు, సెప్టెంబరులో రూ.94,442 కోట్లు, అక్టోబర్లో రూ.100,710 కోట్లు మరియు నవంబర్ లో రూ.97,637 కోట్ల రూపాయలు వసూలయ్యాయని గణాంకాలు వెల్లడించింది.

Read more about: gst
English summary

తగ్గిన జిఎస్టి వసూళ్లు:డిసెంబర్ నెలలో వసూళ్లు పతనం. | GST Collection Drops To ₹94,726 Crore In December

New Delhi: GST collection dropped to ₹94,726 crore in December 2018, lower than ₹97,637 crore collected in the previous month.
Story first published: Wednesday, January 2, 2019, 10:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X