డిసెంబర్ 31 న మద్యం అమ్మకాలు ఇంత పెద్ద ఎత్తున జరిగాయా దేవుడా! టాప్ లో ఉన్నది...
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. న్యూ ఇయర్ వేడుకల్లో నగర యువత మునిగితేలింది. ఇక మందుబాబుల గురించి అయితే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మందులో మునిగితేలిపోయారు.

డిసెంబర్ 31వ:
డిసెంబర్ 31వ తేదీ రాత్రి సమయంలో మద్యం దుకాణాల సమయం పెంచడంతో.. మందుబాబుల్లో హుషారు పెరిగింది. వారి హుషారుతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా పెరిగింది.

హైదరాబాద్ పరిదిలో:
కేవలం డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం సుమారు రూ.70కోట్ల విలువచేసే మద్యం అమ్మకాలు జరిగాయి. అది కూడా కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోనే కావడం గమనార్హం. 2017 డిసెంబర్ 31వ తేదీన రూ.60కోట్ల అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది మరో రూ.10కోట్లు ఎక్కువగానే మద్యం అమ్మకాలు జరిగాయి.

రోడ్లపై:
ఇక మద్యం సేవించి పోలీసులకు చిక్కిన వారి సంఖ్య అయితే.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలోని చాలా ప్రాంతాల్లో.. మందుబాబులు.. డ్రంక్ డ్రైవ్ లో దొరికారు. చాలా చోట్ల మోతాదుకి మించి మద్యం సేవించిన కొందరు.. రోడ్లపై నానా రభస చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక్క డిసెంబరులోనే రూ. 1,962 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఏపీలో:
కొత్త సంవత్సరం రోజు ఏపీలో కూడా మందుబాబులు పండుగ చేసుకున్నారు. డిసెంబర్ 31న రూ. 118 కోట్ల మద్యాన్ని తాగేశారు.

మద్యం అమ్మకాలు:
ఏపీలో రోజుకు రూ. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. డిసెంబరు 29 నుంచి 31 వరకు మొత్తం రూ. 289 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. 29న 103 కోట్లు, 30న 67 కోట్లు, 31న 118 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి.


Click it and Unblock the Notifications