సంచలనం రేపుతున్న చంద్రబాబు ప్రకటన...? ఇది నిజమేనా...? షాక్ లో ప్రజలు
ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చాలు ఇది 1980 నాటి ప్రభుత్వాల నినాదం కొన్ని రోజుల తరువాత ఆ నినాదం కూడా మారింది మేము ఇద్దరం మాకు ఇద్దరు అనే నినాదంకి వచ్చింది. ఇక ఈ నినాదాలు ప్రజలపై బాగానే పని చేసాయి.

పిల్లలని:
అయితే దీనికి తోడు జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రోత్సహించింది. అయితే ఇది అంతా గతం ఇప్పుడు మళ్ళీ ఎక్కువ మంది పిల్లలు కనమని చెప్పే రోజులు వచ్చాయా?ఎక్కువ మంది పిల్లలని కంటే ప్రభుత్వ నుంచి ఎక్కువ పధకాలు వస్తున్నాయా?

చంద్రబాబు నాయుడు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేసాడు ఎక్కువ మంది పిల్లలని కనండి జనాభా పెంచండి అని అయన నినాదం ఇస్తున్నారు అంతేకాకుండా ఎక్కువమంది పిల్లలని కానివారికి అయన ప్రభుత్వం ఎక్కువ పధకాలు ఇస్తాము అని చెబుతున్నారు. ఈ మేరకు జనాభా కొత్త విధానాన్ని త్వరలో అయన తీసుకొస్తాను అని ప్రకటించారు.

జనాభా నియంత్రణ:
చైనా, జపాన్ వంటి దేశాలలో జనాభా నియంత్రణ వల్ల యువకులు తగ్గిపోయారు ఇప్పుడు వృద్దులు ఎక్కువ ఉండే పరిస్థితి వచ్చింది. సమాజంలో సముతులిత దెబ్బ తింటోంది అని చంద్రబాబు నాయుడు తెలిపారు,కానీ చంద్రబాబు నాయుడు ప్రకటన పై విస్మయం వెలువడుతోంది.

ప్రశ్నలు:
ఎందుకంటే ఈరోజుల్లో చాలామంది ఇద్దరు పిల్లలతో తమ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు ఒక్కరితోనే సర్దుకుంటున్నారు. ఇక ఒక్కరికే విద్య, వైద్యం ఇవ్వాలి అంటే తల్లితండ్రులకి కష్టం అవుతోంది.మరి ముగ్గురు నలుగురుని కంటే వారి భారం ప్రభుత్వం మోస్తుందా? వారికీ స్పెషల్ గా ఏమైనా రిజర్వేషన్లు కలిపిస్తారా? అని ప్రశ్నలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications