For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగం చేస్తున్న వారికీ కేంద్రం శుభవార్త ఏంటో చూడండి.

By girish
|

ఈరోజుల్లో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. అటు ప్రేమ వివాహం చేసుకున్న లేదా పెద్దల మాట విని పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య రిలేషన్ సరిగాఉండడం లేదు ఇక పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోతుంటారు.ఇవ్వని చూసిన కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఉద్యోగం చేస్తున్న వారికీ ఒక శుభవార్త తీసుకొచ్చింది ఏంటో చూడండి.

కేంద్ర ప్రభుత్వం:

కేంద్ర ప్రభుత్వం:

కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పురుష ఉద్యోగులకు శుభవార్త. భార్య లేకపోయినా, ఆమె నుంచి విడిపోయినా పిల్లల సంరక్షణ చూసుకు నేందుకు సర్వీసు మొత్తం మీద అదనంగా 730 రోజుల పాటు చైల్డ్ కేర్ లీవ్ (సీసీఎల్) తీసుకో వచ్చు. ఇప్పటివరకు ఈ వెసులుబాటు కేవలం మహిళా ఉద్యోగులకు మాత్రమే వర్తించేది.. ఇప్పుడు దాన్ని పురుషులకూ వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇద్దరు పిల్లల వరకు మహిళా ప్రభుత్వోద్యోగులు ఒక సంవత్సరంలో మూడు విడతలుగా సీసీఎల్ తీసుకోవచ్చు. ఇప్పుడు.. పెళ్లి కాని లేదా భార్య మరణించిన లేదా విడాకులు తీసుకున్న పురుష ప్రభుత్వోద్యోగులు కూడా ఇదే విధంగా సెలవు తీసుకోవచ్చు

730 రోజుల:

730 రోజుల:

అయితే ఇలా సెలవు తీసుకునేందుకు అర్హతలు ఉండే పురుష ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉండే అవకాశమున్నా.. పిల్లల సంరక్షణ చాలావరకు మహిళలే చూసుకుంటారన్న భావన నుంచి కాస్త దూరంగా వెళ్లేందుకు ఇది ఒక మేలి మలుపని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అయితే, 730 రోజుల సెలవు కాలంలో సగం జీతాన్ని మాత్రమే ఇస్తారని సిబ్బంది వ్యవహారాల శాఖ తన ఉత్తర్వులలో పేర్కొంది

ఒక ఏడాదిలో:

ఒక ఏడాదిలో:

ఇంతకుముందు నిబంధనల ప్రకారం అయితే సెలవు సమయంలో 365 రోజుల పాటు వంద శాతం జీతం, తర్వాతి 365 రోజుల పాటు 80% జీతం ఇవ్వాలని ఉండేది. సీసీఎల్‌తో పాటు మహిళలకు 180 రోజులు మాతృత్వ సెలవు, పురుషులకు 15 రోజుల పితృత్వ సెలవు ఉన్నాయి. 2017 మార్చిలో పార్లమెంటు ఆమోదించిన చట్టం ప్రకారం వ్యవస్థీకృత రంగంలోని మహిళలకు మాతృత్వసెలవును 26 వారాలకు పెంచారు. అలాగే సీసీఎల్ విషయంలో కూడా మహిళలకు మరో వెసులుబాటు కల్పించారు. ఒక ఏడాదిలో కేవలం 3 సార్లు మాత్రమే కాకుండా.. ఆరు సార్లు దీన్ని వాడుకోవచ్చని తెలిపారు.

Read more about: modi
English summary

ఉద్యోగం చేస్తున్న వారికీ కేంద్రం శుభవార్త ఏంటో చూడండి. | Good News to Job Holders

Today we all know how human relations are. Relationship between the couple who are married or married to the elderly couple does not have the right to marry and after the birth of children, the children are also divorced. See what the central government has brought up and have a good news for those who are doing the job.
Story first published: Saturday, December 29, 2018, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X