For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గత కొన్ని రోజుల నుండి తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు.నేడు ధరలు.

ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్ ధరలు మరోసారి తగ్గాయి. శుక్రవారం, పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో లీటరుకు 14-22 పైసల మధ్య పడిపోయాయి.

By bharath
|

న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్ ధరలు మరోసారి తగ్గాయి. శుక్రవారం, పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో లీటరుకు 14-22 పైసల మధ్య పడిపోయాయి. శుక్రవారం సవరించిన ధరలు తరువాత ఢిల్లీలో పెట్రోలు ధర రూ.69.74 నుంచి రూ.69.55 రూపాయలకి చేరుకుంది మరియు డీజిల్ శుక్రవారం నాడు 14 పైసలు తగ్గి 63.62 రూపాయలకు చేరుకుంది.

గత కొన్ని రోజుల నుండి తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు.నేడు ధరలు.

ముంబైలో పెట్రోలు రూ .75.18 వద్ద రిటైలింగ్ ఆవుతోంది. డీజిల్ రూ.66.72 రూపాయల నుంచి 15 పైసలు తగ్గి రూ. 66.57 వద్ద నిలిచింది. చెన్నై, కోల్కతాల్లో పెట్రోల్ ధర రూ.72.16 రూపాయలు, రూ.71.65 రూపాయల వద్ద విక్రయించింది. నిన్నటి నుంచి వరుసగా 20 పైసలు, 19 పైసలు తగ్గాయి. డీజిల్, ఈ నగరాల్లో రూ .67.31 మరియు రూ .65.51 రూపాయలు ఉంది.

నోయిడా లో పెట్రోల్ ధర రూ..69.75 నుండి 15 పైసలు తగ్గి రూ.69.60 గా ఉండగా, డీజిల్ 63.09 రూపాయల వద్ద ఉంది. గురుగ్రామ్ లో పెట్రోలు ధరలు 15 పైసలు తగ్గి రూ.70.63 రూపాయలకు చేరుకుంది మరియు డీజిల్ పై 12 పైసలు తగ్గి 63.71 వద్ద నిలిచింది.

శుక్రవారం ఆసియా ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 53 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఐతే, ముడి బెంచ్మార్కులు అక్టోబర్లో అత్యధికంగా 40 శాతానికి పడిపోయాయి.

ముడి ధర పతనం భారతదేశానికి మంచి లాభదాయకం అని చెప్పవచ్చు ఎందుకంటే దేశంలో దాదాపు 80 శాతం కంటే ఎక్కువ ముడి అవసరాన్ని దిగుమతి చేస్తుంది. ఇది దేశ కరెంట్ ఖాతాలోటును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఆర్బిఐ నుండి రెపో రేటును తగ్గించాలన్న ఆశలు పెంచుతుంది.

Read more about: petrol diesel
English summary

గత కొన్ని రోజుల నుండి తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు.నేడు ధరలు. | Petrol Prices Fall Again On Friday, Touch Fresh Lows In 2018

New Delhi: Fuel prices saw another cut on Friday following which petrol prices touched new lows this year. On Friday, petrol, diesel prices fell between 14-22 paise per litre across major cities of the country.
Story first published: Friday, December 28, 2018, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X