For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైతులకి బంపర్ ఆఫర్ ఇస్తున్న మోడీ సర్కార్ ఏంటో చూడండి.

By girish
|

మొన్న జరిగిన ఎన్నికలు బీజేపీ పార్టీకి భారీగా దెబ్బ తినింది. ఈ దెబ్బకి బీజేపీ పార్టీ పెద్దలు మేలుకొని ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు.ఇక ఎలక్షన్స్ కి నాలుగు నెలలు మాత్రమే ఉండడంతో కేంద్రంలోని మోదీ సర్కారు రైతులను ప్రసన్నం చేసుకోడానికి తాయిలాలు సిద్ధం చేస్తోన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో:

తెలంగాణలో:

తెలంగాణలో మాదిరిగా రైతు బంధు పధకాన్ని అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోన్నట్టు సమాచారం. ఈ పథకం ప్రయోజనాలపై ఇప్పటికే వివిధ దశల్లో చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు చేరడం వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులకు కొంతమేర వెసులుబాటు కలుగుతోందని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేంద్రం, ఈ రకమైన తాయిలాలు అందజేసి వారి ఆగ్రహావేశాల్ని చల్లార్చాలని యోచిస్తోంది.

పథకం:

పథకం:

ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే రూ.1.25 లక్షల కోట్లు ఖర్చవుతుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలుచేసేలా విధివిధానాలు రూపొందిస్తోన్నట్టు భోగట్టా.

అమిత్ షా:

అమిత్ షా:

ఈ పథకంపై చర్చల్లో పాల్గొన్న కొందరు కేంద్రం వాటా 70 శాతం, రాష్ట్రాల వాటా 30 శాతంగా ఉండాలని సలహా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు.

రైతాంగం కష్టాలు:

రైతాంగం కష్టాలు:

ఇందులో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వచ్చే ఎన్నికల నాటికి పరిష్కార మార్గాలను చర్చించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ కార్యాచరణను కేంద్ర వ్యవసాయ శాఖ రూపొందించి, ప్రధానికి సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. దేశంలోని వ్యవసాయ సంక్షోభం, రైతాంగం కష్టాలు తదితర పలు అంశాలకు సంబంధించిన పరిష్కరాలను ఈ ప్రణాళికలో చర్చించినట్టు తెలుస్తోంది.

మధ్యతరగతి ప్రజల్లో:

మధ్యతరగతి ప్రజల్లో:

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తప్పక విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. అయితే, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత సులువు కాదు, ఎందుకంటే ఇప్పటికే మధ్యతరగతి ప్రజల్లో కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తకావడం, రైతులు కూడా నిరాశలో ఉండటం దీనికి ప్రధాన కారణం.

బీజేపీ ప్రభుత్వం:

బీజేపీ ప్రభుత్వం:

అందుకే శీతాకాల సమావేశాలు ముగిసేలోగా రైతుల సంక్షేమానికి పలు పథకాలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు తెలియజేశాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర ప్రకటించే పథకం రుణమాఫీకి మించి ఉండబోతున్నట్టు భోగట్టా. ఇది గతంలో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అమలుచేసిన భవంతర్ పథకానికి దగ్గరగా ఉంటుందని అంటున్నారు.

2019 లో:

2019 లో:

ప్రజలు 2019 లో బీజేపీకి అధికారం ఇస్తారా? లేదా కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా? లేదా థర్డ్ ఫ్రంట్ వస్తుందా? చూడాలి.

Read more about: modi
English summary

రైతులకి బంపర్ ఆఫర్ ఇస్తున్న మోడీ సర్కార్ ఏంటో చూడండి. | Modi Giving New Scheme To Farmers in India

Most of the elections have been hit by the BJP party. The BJP leaders are doing well to the people of the party and the blessings of the party are being sacrificed to the people of the center.
Story first published: Friday, December 28, 2018, 13:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X