For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేబుల్ టీవీ వాడుతున్న వారికీ శుభవార్త!

By girish
|

మొన్న వచ్చిన నిబంధనల ప్రకారం బ్రాడ్ కాస్టర్స్ నిర్ణయించిన కొత్త ధరల ప్రకారం బిల్లులు చెల్లించాల్సి ఉండడంతో డి.టి,హెచ్, కేబుల్ బిల్లులు పెరగనున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా కొన్ని ఛానెళ్లు తమ ధరలను ప్రకటించాయి. ఈ కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం ఉన్న బిల్లులు కంటే ఎక్కువ కట్టాలి.

కొత్త నిబంధన:

దేశమంతటా టీవీ ఛానెళ్ల మీదే చర్చ..!వినియోగదారుడు వీక్షించే ఛానెళ్లకు మాత్రమే.. డబ్బులు చెల్లించేలా ట్రాయ్ కొత్త విధివిధానాలు రూపొందించిన క్రమంలో..అంతటా ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త విధానం వల్ల ఎవరికి మేలు? సామాన్యుడి జేబుకు చిల్లు తప్పదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు నచ్చిన ఛానెళ్లను ఎలా ఎంపిక చేసుకోవాలో తెలియక..ఇప్పటి వరకు చాలా మంది జాబితా ఖరారు చేయలేదు. అటు కేబుల్ ఆపరేటర్లు కూడా దీనిపై జనాల్లో అవగాహన కల్పించడం లేదు.

 కేబుల్ టీవీ వాడుతున్న వారికీ శుభవార్త!

ఇక డిసెంబరు 29 తర్వాత పే ఛానెల్స్ ప్రసారంకావన్న ప్రచారం జరుగుతోంది. దాంతో సామాన్య ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గడువును పొడిగించింది ట్రాయ్. పే ఛానెల్స్‌ను ఎంపిక చేసుకునేందుకు జనవరి 31 దాకా గడువును పొడిగిస్తున్నట్లు భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) ప్రకటించింది. గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో ట్రాయ్ కార్యదర్శి ఎస్‌కే గుప్తా సమావేశమై చర్చించారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఛానెళ్ల ఎంపిక ప్రక్రియ సాఫీగా, అంతరాయాలు తలెత్తకుండా సాగేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో.. నెల రోజులు గడువు పొడిగించింది. దాంతో కేబుల్ ఆపరేటర్లే వినియోగదారుల వద్దకు వెళ్లి..వారు కోరుకునే ఛానెళ్ల లిస్టును తీసుకోనుంది.

Read more about: business
English summary

కేబుల్ టీవీ వాడుతున్న వారికీ శుభవార్త! | Good News to Cabel Tv Users

DtH and cable bills are likely to rise as new bills are set to be billed as per the new rules set by the Borrower. Some channels have been in the past few days
Story first published: Friday, December 28, 2018, 13:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X