భారత దేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్ వంతెన పూర్తయింది. 21 ఏళ్ళ కిందట దీని నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఇన్నాళ్లకు పూర్తయిన ఈ వంతెనను వాజ్‌పేయీ జయంతి సందర్భంగా మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల పొడవున రూ.5,920 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు.
అసోంలోని తిన్‌సుకియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్ల్‌గన్ పట్టణాల మధ్య దాదాపు 10 గంటల ప్రయాణ సమయం దీనితో ఆదా కానుంది. రక్షణ పరమైన అవసరాలకూ, ఈశాన్య సరిహద్దు భద్రతా దళానికి చక్కని మౌలిక వసతిగా ఉపయోగపడనుంది. వంతెన కింది భాగంలో రెండు లైన్ల రైలు పట్టాలు, పై భాగంలో మూడు లైన్ల రహదారి ఉంటాయి. ఈశాన్య సరిహద్దుకు రక్షణ సామగ్రిని తరలించే అత్యంత భారీ వాహనాలు వెళ్లేందుకు అనువుగా దీన్ని నిర్మించారు. అత్యవసరపరిస్థితుల్లో ఈ వంతెనపై యుద్ధ విమానాలను లాండింగ్ చేసే వెసులుబాటు కూడా ఉండడం విశేషం. మూడు ప్రాంతాల్లో యుద్ధ విమానాల లాండింగ్ కి ఏర్పాట్లు ఉన్నాయి.

ఎక్కువ వర్షపాతం ఉండే ఈ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిపై వంతెన నిర్మించడం పెద్ద సవాలు అనే చెప్పాలి. ఈ వంతెన వలన అసోంలోని డిబ్రోగఢ్ నగరం బిజినెస్ హబ్‌గా మారుతుందని, విద్యా, వైద్య తదితర రంగాలకు ఊపు రాగలదని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణానికి 1997లొ అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ శంకుస్థాపన చేశారు. తర్వాత 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నిర్మాణ పనులను ప్రారంభించారు. వివిధ కారణాలతో దీని పనులలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఈ వంతెన నిర్మాణం శంకుస్థాపన చేసిన 21 ఏళ్లకు పూర్తయి అందుబాటులోకి వచ్చింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications