ఈరోజుల్లో ప్రతి ఒకరికి ఆన్ లైన్ షాపింగ్ బాగా అలవాటుపడిపోయారు. ఒక సిటీలో ఉన్నవారు మాత్రమే కాదు పల్లెటూరులో ఉన్నవారు తౌన్లలో ఉన్నవారు మొత్తం అంత ఈ ఆన్ లైన్ షాపింగ్ వ్యసనంగా మారిపోయింది.
ఏదైనా పండగ వచ్చిందంటే చాలు ఈ కామర్స్ సంస్థలు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లు వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లకు తెరలేపేవి. అతి తక్కువ ధరకు గ్యాడ్జెట్స్, దుస్తులు ఆఫర్ చేసేవి. కానీ.. ఇక నుంచి అలా భారీ డిస్కౌంట్ సేల్ ఆఫర్ చేసే అవకాశం లేకుండా పోయింది.
దేశంలోని ఈ-కామర్స్ కంపెనీల ఉత్పత్తి విక్రయ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ కామర్స్ పోర్టళ్లు తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధం విధించింది. ఏదైనా ఉత్పత్తిని ప్రత్యేకంగా తమ ఫ్లాట్ ఫామ్ ద్వారానే విక్రయించేలా ఈ-కామర్స్ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా నిషేధించింది.

అంతేకాదు, ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ సంస్థ తాను లేదా తన గ్రూపు కంపెనీలు కొనుగోలుదారులకు ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్‌లు సముచితంగా, వివక్షారహితంగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇకపై ఈ-కామర్స్ కంపెనీలు గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను నిబంధనలకు లోబడి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిపే సర్టిఫికేట్‌తోపాటు చట్టబద్ద ఆడిటర్ రిపోర్టును ఏటా సెప్టెంబరు30కల్లా ఆర్‌బీఐకి సమర్పించాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ కంపెనీలు అసాధారణ స్థాయిలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయని, దాంతో వ్యాపారాలకు తీవ్ర నష్టం జరుగుతోందంటూ దేశంలోని పలు వర్తకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ సైట్లపై ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications