For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కొత్త పొంతలు తొక్కుతోందా?

By girish
|

ఏపీ రాజధాని అమరావతిలో ఈరోజు ఉదయం సచివాలయం ఐదు టవర్లకు ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ రెండు కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఒకటి సచివాలయం కోసం ర్యాప్ట్‌ ఫౌండేషన్‌, రెండోది రాయలసీమలో ఉక్కు కర్మాగారానికి శంఖుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని.. ఇది జీవితంలో మరచిపోలేని సంఘటన అని అన్నారు. అత్యంత సాంకేతికత పరిజ్ఞానంతో సచివాలయ టవర్ల నిర్మాణం జరుగుతుందని.. ప్రపంచానికే తలమానికంగా సచివాలయ టవర్లు నిర్మిస్తామని తెలిపారు. దేశంలోనే తొలిసారి ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ విధానం తీసుకొచ్చామన్నారు. 36 నెలల్లో టవర్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కొత్త పొంతలు తొక్కుతోందా?

తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని, బౌద్దస్తూపం ఆకారంలో ఐకానిక్ భవనం నిర్మిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. సచివాలయ ప్రాంగణంలో 4వేల కార్లు పార్క్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒకేసారి 10వేల మంది విజిటర్స్‌కు ఆతిథ్యం లభిస్తుందని, 1375 ఎకరాలలో పరిపాలన భవనాలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా హైకోర్టు విభజనను స్వాగతిస్తున్నామని చంద్రబాబు అన్నారు. జనవరి1 నుంచి విజయవాడ సీఎం క్యాంప్‌ ఆఫీసులో తాత్కాలికంగా హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. అమరావతిలో శాశ్వత భవనం నిర్మించిన తర్వాత.. ప్రస్తుత తాత్కాలిక హైకోర్టును జిల్లా కోర్టుగా మారుస్తామన్నారు.

Read more about: andhra pradesh
English summary

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కొత్త పొంతలు తొక్కుతోందా? | Andhrapradesh New Capital Amaravathi

Today, in the AP Capital of Amravati, the Secretariat of the Secretariat of the five towers started functioning by CM Chandrababu. Speaking on the occasion, he said that both are doing today. One is the Rapport Foundation for the Secretariat, the other being the steel factory in Rayalaseema.
Story first published: Thursday, December 27, 2018, 13:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X