ఐపిఎల్ 12 వ సీజన్ జైపూర్ వేదికగా సంచలనాలు?స్టార్ క్రికెటర్లు గల్లంతు?
ఐపిఎల్ 12 వ సీజన్ రికార్డుల మోత మోగించింది మొత్తం 70 స్థానాల భర్తీ కోసం భారత్ మరియు విదేశీ క్రికెటర్లతో వేలం ప్రారంభించింది.
ఐపిఎల్ 12 వ సీజన్ రికార్డుల మోత మోగించింది మొత్తం 70 స్థానాల భర్తీ కోసం భారత్ మరియు విదేశీ క్రికెటర్లతో వేలం ప్రారంభించింది.ఐపిఎల్ జట్టులకు ప్రముఖ కంపెనీలు మరియు వ్యాపారవేత్తలు ఫ్రాంఛైజీలుగా వ్యవహరిస్తారు.వీరు ఆటగాళ్లను వారి రికార్డును బట్టి వేలం పాటలో దక్కించుకుంటారు.అధిక మొత్తం లో వేలం చెల్లించిన ఆటగాళ్లను చూడండి ..

వరుణ్ చక్రవర్తి:
రూ.20 లక్షల కనీస ధర తో ఉన్న భారత దేశవాళీ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి రికార్డు స్థాయిలో రూ.8.40 కోట్ల రూపాయలు దక్కించుకున్నాడు.మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ను 'కింగ్స్ ఇలెవెన్ పంజాబ్' సొంతం చేసుకుంది.

జయదేవ్ ఉనడ్కట్:
మరోవైపు గత సీజన్ వేలంలో టాపర్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ జయదేవ్ ఉనడ్కట్ ను రూ.8.50 కోట్ల ధరతో 'రాజస్థాన్ రాయల్స్' దక్కించుకుంది.రూ.1.50 లక్షల కనీస ధరతో ప్రారంభమైన ఉనడ్కట్ వేలం చివరకు రూ.8.50 కోట్ల ధరతో ముగిసింది.

మహమ్మద్ షమీ:
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షామిని 'రాజస్థాన్ రాయల్స్' రూ.4.80 కోట్ల రూపాయలకు దక్కించుకుంది అలాగే లంబు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ని రూ.1.10 కోట్ల ధరకు ఢిల్లీ జట్టు దక్కించుకుంది.

హనుమ విహారి:
ఇక టీం ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారి ని ఢిల్లీ ఫ్రాంచైజీ రూ.2 కోట్ల రూపాయల ధరకు దక్కించుకుంది.వెస్టిండీస్ T20 కెప్టెన్ చార్లెస్ బ్రేత్వయిట్ మరియు టీం ఇండియా స్పిన్ అల్ రౌండర్ అక్షర పటేల్ కు చెరి రూ.5 కోట్ల ధర పలికింది.

యువరాజ్ సింగ్:
సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మరియు టెస్ట్ క్రికెటర్ పుజారాను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఒకప్పుడు యువరాజ్ ను వేలంలో దక్కించుకునేందుకు ఎగబడే అనేక ఫ్రాంచైజీలు ప్రస్తుతం ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

స్టార్ క్రెకెటర్ల వేలం గల్లంతు:
ఈ సీజన్ లో వేలం సరళి చూస్తే అనామక క్రికెటర్లకి కోట్లల్లో ధర పలికింది స్టార్ క్రికెటర్లు ఒకప్పుడు T20 దిగ్గజాలుగా చెప్పుకున్న యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళను ఎవరు కొనడానికి ముందుకు రాకపోవటం చూస్తే వొకన్తు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications