అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి మరియు రూపాయి విలువ డాలర్ తో పోల్చి చూస్తే మెరుగుపడింది.
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి మరియు రూపాయి విలువ డాలర్ తో పోల్చి చూస్తే మెరుగుపడింది. శనివారం ధరల సమీక్ష తరువాత పెట్రోలు దేశంలోని ప్రధాన నగరాల్లో 19-20 పైసలు తగ్గాయి. డీజిల్ ధర లీటరుకు 22 పైసలు పడిపోయింది.

ముంబైలో పెట్రోలు ధరలు రూ.76 రూపాయల నుండి రూ.75.89 రూపాయలకు చేరుకున్నాయి. డీజిల్ .67.39 రూపాయల నుండి తగ్గి రూ.67.17 గా నమోదైంది అని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం.అదేవిధంగా, దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం పెట్రోల్ ధర రూ. 70.27 వద్ద విక్రయించగా అలాగే డీజిల్ రూ.64.19 రూపాయల వద్ద ఉంది.
చెన్నై, కోల్కతాలలో పెట్రోల్ ధర రూ.72.91 రూపాయలు, రూ.72.36 రూపాయల వద్ద ఉంది. ఈ నగరాల్లో డీజిల్ ధర రూ .67.77, రూ. 65.95 ఉంది.
నోయిడాలో పెట్రోల్ ధర రూ. 70.16 వద్ద ఉండగా శుక్రవారం రూ. 70.31 గా ఉంది. డీజిల్ ధర రూ. 63.58 వద్ద ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది 17 పైసలు తగ్గింది.
అంతర్జాతీయ ముడి చమురు ధరలు శుక్రవారం మళ్లీ పడిపోయాయి. శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.98 శాతం క్షీణించి 53.82 డాలర్లకు పడిపోయాయి. 2017 నాటి మూడవ త్రైమాసికం నుంచి ఇది అతి తక్కువ స్థాయి. చమురు ధరలు ఈ వారంలో 11 శాతం తగ్గాయి.
ఇదిలా ఉండగా ఈ వారం డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ కూడా 2 శాతం మేరకు పెరిగింది. భారతదేశంలో రిటైల్ ఇంధన ధరలకు ప్రధాన కారణం ముడి చమురు ధరల పతనం మరియు రూపాయి విలువ బాగా పెరగడం .ఈ రిటైల్ ఇంధన ధరలు రాబోయే రోజులలో మరింత తగ్గుతుందని సూచిస్తుంది. భారతదేశంలో రిటైల్ ఇంధన ధరలు అంతర్జాతీయ చమురు ధర మరియు రూపాయి-డాలర్ మారకం రేటు రెండింటిపై ఆధారపడుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications