సమావేశం ప్రారంభం వీటి ధరలు తగ్గుతున్నాయి ఒక లుక్ వేయండి.
ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 31వ సమావేశం నిర్వహిస్తుండగా... ఇప్పుడు అందరి చూపు ఈ సమావేశంపైనే ఉంది. కొన్ని వస్తువులపూ జీఎస్టీ స్లాబ్ మారుస్తారనే ప్రచారంతో వేటిపై తగ్గిస్తారు... వేటిని కొనసాగిస్తారనే చర్చ సాగుతోంది.

వీటిపై నన్నులు తగ్గొచ్చు
ఎయిర్ కండిషనర్ల, వాషింగ్ మెషీన్స్, టీవీలు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, టైర్లు, సిమెంటు వంటి నిర్మాణ సామాగ్రి దాదాపు 34 వస్తువులపై ఇప్పటి వరకు అత్యధికంగా 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా... వీటిలో టైర్లు, సిమెంట్‌పై జీఎస్టీని 18 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఎయిర్ కండీషనర్, పవర్ బ్యాంకులు, కంప్యూటర్ మానిటర్లు, వాషింగ్ మెషీన్లపై జీఎస్టీ తగ్గనుంది. ఇక కేంద్ర ప్రభుత్వం యొక్క గృహ పథకాన్ని ప్రోత్సహించేందుకు గాను... గృహనిర్మాణానికి ఉపయోగపడే వస్తువులపై ఇప్పటి వరకు 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా... ఇప్పుడు దానిని 8 శాతానికి తగ్గించనున్నారని తెలుస్తోంది.
వీటిపై పన్ను తగ్గకపోవచ్చు
కొన్ని వస్తువులు జీఎస్టీ స్లాబ్‌ను మార్చుకోనుండగా... ఇక పానీయాలు, సిగరెట్లు, బీడీ, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, ధూమపాన పైపులు, ఆటోమొబైల్స్, పడవలు, రివాల్వర్లు, తుపాకీలు వంటివి 28 శాతం స్లాబ్‌లోనే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మూలం: ఏన్ టీవీ..


Click it and Unblock the Notifications