ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తమిళనాడులో రజనికాంత్ ఏంటో మీరే చూడండి.
మొన్న పవన్ కళ్యాణ్ ఈరోజు సూపర్ స్టార్ రజని కాంత్ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ చదవండి.వరసగా సినిమాలు చేస్తున్న రజినీకాంత్, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అంశంపై మొన్నటి వరకు సందేహాలు ఉండేవి. రజిని మక్కల్ మందిరం అనే పేరుతో పార్టీని స్థాపించినా.. నిన్నా మొన్నటి వరకు పెద్దగా యాక్టివ్ గా లేదు. 2పాయింట్ 0 తరువాత రజిని రాజకీయాల్లో యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తున్నది.

మూడు ఛానల్స్:
తమిళనాడులో ప్రతి పార్టీకి సొంతంగా ఒక ఛానల్ ఉంది. ఇదే బాటలో రజినీకాంత్ కూడా నడవబోతున్నాడు. రజినీకాంత్ పేరుమీద మూడు ఛానల్స్ రాబోతున్నాయి. రజినీకాంత్ టీవీ, సూపర్ స్టార్ టీవీ, తలైవా టీవీ. వీటికి సంబంధించిన లోగోలు కూడా రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. రేపోమాపో దీనికి సంబంధించిన అధికారికమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తున్నది.

పవన్ కళ్యాణ్ టీవీ ఛానల్:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర పేరుతో దూసుకెళ్తున్నాడు. జనంలో మన్నన పొందుతున్నాడు. అయితే చీమ చిటుక్కుమన్న ప్రసారం చేసే మీడియా పవన్ కళ్యాణ్ యాత్రని మాత్రం పక్కన పెట్టేసింది.

మీడియా సపోర్ట్:
పవన్ కళ్యాణ్ కు మీడియా సపోర్ట్ లేదు కేవలం ప్రజలు మరియు అభిమానులతో నెట్టుకొచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

కవరేజ్:
ప్రస్తుతం ఉన్న ఛానెల్స్ అన్ని ఒక వర్గానికి చెందినవి కావడంతో కవరేజ్ సరిగా ఉండడం లేదు. ఛానెల్స్ అన్ని వారికే కొమ్ముకాస్తున్నాయి.

ఊరుఊర తిరిగి:
ప్రజల సమస్యల పై ద్రుష్టి పెట్టి అక్కటుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, పోరాట యాత్రలో భాగంగా ఒక సమయం ,సందర్భం లేకుండా ఊరుఊర తిరిగి గొంతు అరిగిపోయేలా ప్రజల సమస్యలను అడిగి మరి తెలుసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్.

చిరంజీవి:
గతంలో చిరంజీవి ఓడిపోవడానికి కారణం కూడా ఇదే కావచ్చు . కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే గజగజ వణిపోతున్నారు అంత. పవన్ కళ్యాణ్ కి ఇరు రాష్ట్రాలలో క్రేజ్ ఆలా ఉంది మరి.
అయితే పవన్ కళ్యాణ్ కి అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ శ్రమ ఎంతో కొంత నీరుకారిపోతుంది అని ఇక ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతోంది.

పబ్లిసిటీ కావాలి:
కాబ్బటి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు పబ్లిసిటీ కావాలి అంటూ అడుగులు వేస్తున్నాడు. ఇక పబ్లిసిటీ కావాలి అంటే ఏదో ఒక ఛానల్ తో కలిసిపోతే సరిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా టీవీ ఛానల్ పెట్టే పనిలో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ లో ఉన్న ఒక ప్రముఖ ఛానల్ని లీజ్ కి తీసుకుంటున్నట్లు సమాచారం.

NRI వింగ్:
ఇక ఛానల్ పెట్టాలంటే చాలా డబ్బు కావాలి మరి ఆ డబ్బు వ్యవహారం ఎవరు చూస్తున్నారు అంటే ఈ బాధ్యతలు అన్ని పవన్ కళ్యాణ్ NRI వింగ్ మాత్రమే చూసుకుంటున్నారు అంటా.


Click it and Unblock the Notifications