తెలంగాణలో పెన్షన్ రావాలి అంటే పక్క ఇవి ఉండాలి మీ దగ్గర ఉన్నాయా?
తెలంగాణలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా ప్రభుత్వం తరపున చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం అమలులో వున్న నిబంధనల ప్రకారం 65 ఏళ్లు నిండిన వారికే ఈ ఆసరా పెన్షన్లు వర్తిస్తుండగా... వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 57 ఏళ్లు నిండిన వారికి కూడా వృద్ధాప్య పెన్షన్లు అందచేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ చేసిన సూచనలు మేరకు తాజాగా అధికారయంత్రాగం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించింది. ఈమేరకు ప్రభుత్వం జారీచేసిన నియమనిబంధనలు, మార్గదర్శకాలు ఇలా వున్నాయి. ఈసారి వయసు నిర్ధారణకు ఓటరుకార్డును ప్రామాణికంగా తీసుకోవడం విశేషం. మిగిలిన ఆసరా పింఛన్ల నిబంధనలు యథాతథంగా ఉంటాయి.

నిబంధనలు..
- 57 ఏళ్లు నిండినవారు అర్హులు (1953-1961 మధ్య జన్మించిన వారై ఉండాలి).
- ఓటర్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారణ.
- దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు అనర్హులు (తెల్ల రేషన్ కార్డు కలిగి వుండటం దారిద్ర్యరేఖకు దిగువన వుండటాన్ని సూచిస్తుంది).
- విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్న వారు ఈ ఆసరా పెన్షన్ పథకానికి అనర్హులు.
- దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండొద్దు.
- దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు పరిమితి దాటొద్దు.
- దరఖాస్తుదారులకు పెద్ద పెద్ద వ్యాపారాలు ( ఆయిల్, రైస్, పెట్రోల్ పంపులు వంటి ఇతర వ్యాపారాలు) ఉండరాదు.
- పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేవారు.. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి వున్న వారు అయ్యుండకూడదు.
- దరఖాస్తుదారులకు భారీ వాహనాలు (హెవీ వెహికిల్స్) ఉండరాదు.
- ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు అనర్హులు.
- లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండరాదు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications