ప్రస్తుతం మనం చూస్తున్నాం ఐనదానికి కానిదానికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి అంటున్న వివిధ శాఖలకు సుప్రీమ్ కోర్ట్ ఊహించని ఝలక్ ఇచ్చింది.
ప్రస్తుతం మనం చూస్తున్నాం ఐనదానికి కానిదానికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి అంటున్న వివిధ శాఖలకు సుప్రీమ్ కోర్ట్ ఊహించని ఝలక్ ఇచ్చింది.ఇకపై ఏ సంస్థ ఐనా చిరునామా ధ్రువీకరణ గుర్తింపు కోసం ఆధార్ అడిగితే కఠిన చర్యలు తప్పవంటున్నారు.

కోటి వరకు జరిమానా:
సదరు వ్యక్తి కి సంబందించిన వ్యక్తిగత వివరాల కోసం ఆధార్ అడిగితే కోటి రూపాయల జరిమానా అలాగే మూడు నుంచి పదేళ్ల దాక జైలు శిక్ష విధిస్తామని సుప్రీమ్ కోర్ట్ వెల్లడించింది.ఈ మేరకు సవరించిన నిబంధనలకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.

వ్యక్తిగత గోప్యత:
వ్యక్తిగత గోప్యతతో సహా వివిధ అంశాలపై సందేహాలు ఉన్న నేపథ్యంలో సుప్రీమ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనల్ని సవరించింది.ఇకపై బ్యాంకు ఖాతాలు తెరవాలన్న సిం కార్డు కొనాలన్నా ఆధార్ అవసరమే లేదు.

దరఖాస్తు సమయంలో:
రేషన్ కార్డు పాస్స్పోర్టులు దరఖాస్తు చేసే సమయంలో కూడా ఆధార్ ఇవ్వాల్సిన పనిలేదు సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వ నిధులతో అందించే సంక్షేమ పథకాలకు మాత్రం ఆధార్ తప్పనిసరిగా ద్రువీకరించాలని తెలిపింది.

KYC ప్రక్రియ:
వినియోగదారులు తమ ఇష్టపూర్వకంగా ఆధార్ గుర్తింపు కార్డును KYC ప్రక్రియకు ఉపయోగించుకునేందుకు సవరణ చేసింది.సుప్రీమ్ కోర్ట్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల ఆధ్వర్యంలో తప్పని సరి చేసేలా అక్కడి ప్రభుత్వాలకు వెసులుబాటు కలిగించేలా కేంద్రం నిర్ణయించింది.

18 ఏళ్ళు నిండిన తరువాత:
మైనర్లుగా ఉన్నపుడు ఆధార్ నమోదు చేసుకున్న వారు 18 ఏళ్ళు నిండిన తరువాత ఆధార్ ఉండాలి వద్ద అనే నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా తెలిపింది.ఆధార్ పై సుప్రీమ్ కోర్ట్ తీర్పు మేరకు భారత టెలిగ్రాఫ్,PMLA చట్టాలకు సవరణలు చేసింది.పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.


Click it and Unblock the Notifications