తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్న హరీష్ రావు ఏంటో మీరే చూడండి.
నిన్నకెసిఆర్ గారు తెలంగాణలో57 ఏళ్లు నిండినవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు వినిపించారు. శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు.

పెన్షన్:
అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడంతోపాటు, అర్హులైన వారిని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషిని ఆదేశించారు. వృద్ధాప్య పెన్షన్‌కి అర్హులైన అభ్యర్థుల సంఖ్య నిగ్గుతేలిన అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఈ పథకం కోసం అవసరమైన మొత్తంలో నిధులు కేటాయించి, ఏప్రిల్ నెల నుంచే లబ్ధిదారులకు పెన్షన్లు అందివ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

ఏప్రిల్:
ఈరోజు ఏప్రిల్ నెల నుండి పెంచిన పింఛన్లు ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా అంబెడ్కర్ నగర్ అరుంధతి కళ్యణ మండపంలో చీరల పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ఆశీర్వదంతో నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు

హరీష్ రావు:
మీరు ఇచ్చే అధరణ మరువ లేనిది.. మీ అభిమానం వెల కట్టలనేదన్నారు. ఏప్రిల్ నెల నుండి పెంచిన పింఛన్లు ఇవ్వబోతున్నాం, నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నాం అని తెలిపారు. బతుకమ్మ చీరలను కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఎన్నికలు అయ్యాక ఇస్తాం అని చెప్పాం. చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు వచ్చి చీరలు ఇస్తున్నాం అని హరీష్ రావు అన్నారు.

భవిష్యత్ లో:
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం జరుగుతుంది. కొన్ని రోజులు ఇబ్బంది ఉన్నా.. భవిష్యత్ లో పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుకుంటాం అని హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం.

హామీ:
ఎస్సి స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేసుకొని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ఇలాంటివి మరెన్నో కూడా చేస్తాను. సిద్దిపేట ప్రజల గురించి శక్తి వంచన లేకుండా పని చేస్తానని హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications