For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న పెన్షన్ ఈరోజు మరో తీపి కబురుతో వస్తున్న తెలంగాణ ప్రభుత్వం!

By girish
|

నిన్న తెలంగాణలో57 ఏళ్లు నిండినవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు వినిపించారు. శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు.

నిధులు:

నిధులు:

అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడంతోపాటు, అర్హులైన వారిని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషిని ఆదేశించారు. వృద్ధాప్య పెన్షన్‌కి అర్హులైన అభ్యర్థుల సంఖ్య నిగ్గుతేలిన అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఈ పథకం కోసం అవసరమైన మొత్తంలో నిధులు కేటాయించి, ఏప్రిల్ నెల నుంచే లబ్ధిదారులకు పెన్షన్లు అందివ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

మరో తీపి కబురు:

మరో తీపి కబురు:

ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రూ. 1028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ప్రధానమంత్రి స్వస్థి యోజన పథకం కింద ఎయిమ్స్ ఆస్పత్రికి అంగీకారం తెలిపింది.

ఎయిమ్స్ ఆసుపత్రిలో:

ఎయిమ్స్ ఆసుపత్రిలో:

ఈ ఎయిమ్స్ ఆసుపత్రిలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. 750 పడకలతో 15 నుంచి 20 ప్రత్యేక విభాగాలతో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఎయిమ్స్ లో 1500 ఓపీ, 1000 మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశం ఉంది.

 మెడికల్ కళాశాల:

మెడికల్ కళాశాల:

ఎయిమ్స్ ఎమర్జెన్సీ, ట్రామా కేర్, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కళాశాల సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చెయ్యాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.

కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు:

కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు:

ఇటీవలే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. మరోవైపు 1264 కోట్ల రూపాయల ఖర్చుతో తమిళనాడులోని మధురైలోనూ ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మాణానికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది

Read more about: telangana
English summary

నిన్న పెన్షన్ ఈరోజు మరో తీపి కబురుతో వస్తున్న తెలంగాణ ప్రభుత్వం! | Aiims in Hyderabad Approved by Central

the government of Telangana has given a sweet curry to the government. Rs. The Union Cabinet approved the construction of AIMS hospital in Bibinagar with Rs 1028 crore. The Prime Minister has agreed to the AIIMS hospital under the Swayat Yojana scheme.
Story first published: Tuesday, December 18, 2018, 11:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X