For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సాప్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మీకోసం!

By girish
|

ఈరోజుల్లో చిన్న-పెద్ద తేడా లేకుండా ప్రతి ఒకరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక స్మార్ట్ ఫోన్ ఉంటే కచ్చితంగా వాట్సాప్ వాడుతుంటారు. ఇక ఈరోజుల్లో వాట్సాప్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు ఇక మీ ఫోన్ పోతే వాట్సాప్ పోయినట్లే కానీ మీ ఫోన్ పోతే కూడా వాట్సాప్ అకౌంట్ భద్రంగా ఉంటాయి.

ఫోన్‌లో సిమ్‌కార్డు లేకున్నా వై-ఫై సర్వీసును ఉపయోగించడం ద్వారా వాట్సాప్‌ ఖాతాకు సందేశాలను పంపే అవకాశం ఉంది. వాట్సాప్‌ డేటాను బ్యాకప్‌ చేసుకోకుండా కొత్త ఫోన్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది.

వాట్సాప్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మీకోసం!

కానీ ఒకవేళ ఫోన్‌ పోయినా దొంగతనానికి గురైనా మన వాట్సాప్‌ ఖాతా, అందులోని సమాచారం భద్రంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి. మన ఫోన్‌ పోయినప్పుడు తొలుత మనం సర్వీస్‌ ప్రొవైడర్‌కు కాల్‌ చేసి సిమ్‌ కార్డును లాక్‌ చేయించాల్సి ఉంటుంది.

దీని ద్వారా ఫోన్‌లోని వాట్సాప్‌ ఆప్షన్‌ డిజేబుల్‌ అవుతుంది. ఆ సమయంలో ఫోన్‌ను వాడటం కుదరదు. ఒకవేళ యాక్టివేట్‌ చేయాలంటే మరో నెంబర్‌కు మెసేజ్‌ కానీ, ఫోన్‌ కానీ చేయాలి. ఒకవేళ కొత్త ఫోన్‌ తీసుకుంటే కొత్త సిమ్‌ కార్డుతో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

ఒకవేళ సిమ్‌ కార్డు యాక్టివేట్‌ అవడంలో ఆలస్యమైతే వాట్సాప్‌ కస్టమర్‌ కేర్‌కు ఈమెయిల్‌ పంపొచ్చు. 'నా ఫోన్‌ పోయింది. ఖాతాను డీయాక్టివేట్‌ చేయండి' అని మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది. మెయిల్‌లో మన భారతదేశ కోడ్‌తో పాటు ఫోన్‌ నంబర్‌ను కూడా పంపాల్సి ఉంటుంది.

వాట్సాప్‌ ఖాతా డీయాక్టివేటైనా కూడా మన మిత్రుల కాంటాక్ట్స్‌ నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. నెల రోజుల పాటు ఆ మెసేజ్‌లు పెండింగ్‌లో ఉంటాయి. 30 రోజుల తర్వాత కూడా వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేసుకోకపోతే ఖాతా శాశ్వతంగా డిలీట్‌ అయ్యే అవకాశం ఉంది.

Read more about: whatsapp
English summary

వాట్సాప్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మీకోసం! | Whatsapp New News

Using a Wi-Fi service, it is possible to send messages to Watsap account without a SIM card. This feature is very useful if you want to take a new phone without backing Watsap data.
Story first published: Monday, December 17, 2018, 16:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X