For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గెలిచిన వెంటనే తెలంగాణ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇస్తున్న కెసిఆర్ ఏంటో మీరే చూడండి.

By girish
|

ఎన్నికలు గెలిచి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ . ఆసరా పింఛన్ వయస్సును 57 ఏళ్లకు కుదించడం, పెన్షన్‌ను రూ.2016కు పెంచడం, వికలాంగుల పెన్షన్‌ను రూ.3016కు పెంచడం, రైతు బంధు పథకం సాయం రూ.10 వేలకు పెంచడం.ఇలా ఎన్నికల ముందు తెరాస పార్టీ ఇచ్చిన హామీలలో కొన్ని.

సాగునీటి ప్రాజెక్టులు:

సాగునీటి ప్రాజెక్టులు:

సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడం, చెరువులు పూడికతీసి, వాటిని నింపడం, కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పారడం, వంటివి సానుకూల అంశాలు తెరాస పార్టీకి కలిసొచ్చాయి.

 రైతులకు:

రైతులకు:

సాగువిస్తీర్ణం పెరగడం, దిగుబడులు పెరగడం, సేద్యం పండుగలా మారడం, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలతో రైతు పక్షపాతిగా సిఎం కెసిఆర్ మారాయి. పెన్షన్లు, కెసిఆర్ కిట్, గొర్రెల పంపిణీ, చేపపిల్లల ఉచిత పంపిణీ, వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్ధిక స్వరూపాన్నే మార్చేశాయి.

కళ్యాణలక్ష్మి:

కళ్యాణలక్ష్మి:

కళ్యాణలక్ష్మి, షాదీముబాకర్, రేషన్ బియ్యం, కంటి వెలుగు, విదేశీ విద్య పథకం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, జర్నలిస్టులు, ఆటోడ్రైవర్లు, హోంగార్డులకు ప్రమాద భీమా.. ఇలా చెబుతూ పోతే పెద్ద జాబితా అవుతుంది. పేదలకు భరోసా నింపే ఈ పథకాలే టిఆర్‌ఎస్‌కు శ్రీరామరక్షగా నిలిచాయి.

వృద్దాప్య పెన్షన్:

వృద్దాప్య పెన్షన్:

తెలంగాణలో57 ఏళ్లు నిండినవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు వినిపించారు. శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు.

ఆదేశాలు:

ఆదేశాలు:

అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడంతోపాటు, అర్హులైన వారిని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషిని ఆదేశించారు. వృద్ధాప్య పెన్షన్‌కి అర్హులైన అభ్యర్థుల సంఖ్య నిగ్గుతేలిన అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఈ పథకం కోసం అవసరమైన మొత్తంలో నిధులు కేటాయించి, ఏప్రిల్ నెల నుంచే లబ్ధిదారులకు పెన్షన్లు అందివ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

 ప్రగతి భవన్‌లో:

ప్రగతి భవన్‌లో:

పంచాయతీరాజ్ అంశాలతోపాటు, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలపై నేడు ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించే క్రమంలో కేసీఆర్ ఈ ఆదేశాలు జారీచేశారని తెలుస్తోంది.

Read more about: pension
English summary

గెలిచిన వెంటనే తెలంగాణ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇస్తున్న కెసిఆర్ ఏంటో మీరే చూడండి. | KCR Giving Pension to Telangana Old People

The current Chief Minister, KCR, is in the process of fulfilling the assurances given after the swearing-in elections. Increasing the pension age to 57 years, increase pension to Rs.2016, increase the pension to Rs. 3016, and increase the farmers' assistance to Rs.10,000. Some of the guarantees given by the TRS party before the election.
Story first published: Monday, December 17, 2018, 11:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X