దుబాయ్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన 13 ఏళ్ల బాలుడు తన వయసుకు మించిన ప్రతిభతో అందరు ముక్కున వేలేసుకునేలా చేశాడు. నాలుగేళ్ల క్రితం తొలి మొబైల్ యాప్‌ను రూపొందించిన ఈ బాలుడు తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీని సొంతం చేసుకున్నాడు. మేరకు ఆదివారం మీడియా నివేదికలు తెలిపాయి. ఆ బాలుడి పేరు ఆదిత్యన్ రాజేష్, కేరళ రాష్ట్రానికి చెందిన ఇతను తొమ్మిదేళ్లకే తొలిసారిగా మొబైల్ అప్లికేషన్‌ను డెవలప్ చేయగా, ఇది బెడ్‌రూమ్‌లో ఒక హాబీగా తీసుకుని చేసిన యాప్ అని ఆ బాలుడు తెలిపాడు. ప్రస్తుతం క్లయింట్లకు లోగోల డిజైనింగ్, వెబ్‌సైట్లను రూపొందిస్తున్నాడు. ఐదేళ్ల నుంచే కంప్యూట్‌లో ఓనమాలు నేర్చుకుని, ఎట్టకేలకు 13 ఏళ్ల వయసులోనే 'ట్రినెట్ సొల్యూషన్స్' అనే కంపెనీని సొంత చేసుకున్నాడని ద ఖలీజ్ టైమ్స్ పేర్కొంది.

'నేను కేరళలోని తిరువిల్లాలో జన్మించాను. నాకు ఐదేళ్లున్నప్పుడు కుటుంబమంతా దుబాయ్‌కు వెళ్లింది. మా నాన్న నాకు తొలుత చూపించిన వెబ్‌సైట్ బిబిసి టైపింగ్. ఇది చిన్నారులు, విద్యార్థులు టైపింగ్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది' అని ఆదిత్యన్ చెప్పినట్టు దుబాయ్‌కు చెందిన ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ట్రినెట్‌లో మొత్తం ముగ్గురు ఉద్యోగులు ఉండగా, వీరంతా ఆదిత్యన్ చదివే స్కూల్ స్నేహితులే, కంపెనీ స్థాపించాలంటే యజమానికి కనీసం 18 ఏళ్లు ఉండాల్సి ఉందని, అయితే అంత వయసు లేనప్పటికీ మేమంతా కంపెనీ తరహాలోనే పనిచేస్తామని ఆ బాలుడు చెప్పాడు. ఇప్పటికే 12 మంది వినియోగదారులతో పనిచేస్తున్నామని, డిజైనింగ్, కోడింగ్ సేవల్ని ఉచితంగా అందిస్తున్నామని ఆదిత్యన్ రాజేశ్ అన్నాడు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications