For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి SBI బ్యాంకు బంపర్ ఆఫర్ ఈరోజే లాస్ట్ డేట్ డోంట్ మిస్!

By girish
|

ఈ దేశంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా. ఇక స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వినియోగదారులకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిన్న ప్రకటించిన పెట్రోల్ ఆఫర్ కొనసాగించింది.ఉచిత పెట్రోల్‌ ఆఫర్‌ను ఎస్బీఐ మరికొన్ని రోజులు పొడిగించింది. తమ ఖాతాదారులకు 5 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా అందించనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఆఫర్‌ను డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్టు ఎస్బీఐ తెలిపింది.

ఎస్బీఐ ట్వీట్టర్‌లో:

ఈ మేరకు ఎస్బీఐ ట్వీట్టర్‌లో ఉచిత పెట్రోల్ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఎస్బీఐ కార్డు లేదా భీమ్ ఎస్బీఐ పే ద్వారా ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్ల ద్వారా పెట్రోల్‌ కొంటే 5 లీటర్ల వరకు పెట్రోల్‌ను ఉచితంగా పొందవచ్చని ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి ఈ ఆఫర్ ఈ ఏడాది నవంబర్ 23తో ముగిసింది.కానీ, ఈ ఆఫర్ ను మరో 15 రోజుల వరకు అంటే డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.

ఇండియన్‌ ఆయిల్‌:

ఇండియన్‌ ఆయిల్‌:

ఇండియన్‌ ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్‌ బంకులోనైనా కనీసం 100 రూపాయల విలువైన పెట్రోలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదీ భీమ్‌, ఎస్‌బీఐకార్డు ద్వారా డబ్బులు చెల్లించాల్సిందే.

 నంబర్:

నంబర్:

12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెలఅధికార కోడ్‌ను 9222222084కు ఎస్ఎంఎస్ చేయాలని ఎస్బీఐ ప్రకటించింది. ఒక కస్టమర్ రిపీట్ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను పంపవచ్చని ఎస్బీఐ ప్రకటించింది అయితే ప‍్రతీ ఎస్‌ఎంఎస్‌కు డిఫరెంట్‌ కోడ్‌ ఉండాలని కండిషన్ పెట్టింది.

భీమ్‌ ద్వారా:

భీమ్‌ ద్వారా:

భీమ్‌ ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్‌ , ఎస్‌బీఐ కార్డుల ద్వారా చెల్లింపుల విషయంలో 6అంకెల కోడ్‌ను నిర్దేశిత నంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి వుటుంది.

అంతేకాదు:

అంతేకాదు:

అంతేకాదు ఇలా అందిన ఎస్‌ఎంఎస్‌లలో ఎంపికచేసిన దానికి 50 ,100 ,150, 200 రూపాయలు స్పెషల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. ప్రచార కాలంలో ఒక మొబైల్ నంబర్ గరిష్టంగా రెండు సార్లు ఈ ఆఫర్‌ పొందే అవకాశం. ఆఫర్‌ ముగిసిన రెండువారాల్లో విజేతలను ప్రకటిస్తారు.

ఎన్నో ఆఫర్లు:

ఎన్నో ఆఫర్లు:

ఎన్నో ఆఫర్లు ఇస్తున్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కానీ కొన్ని విషయాలలో వినియోగదారులకి ఎన్నో ఇబ్బంది తెచ్చే మార్గాలు తెచ్చిపెట్టింది. దేశంలో ఎక్కువ వినియోగదారులు ఉన్న బ్యాంకు కనుక వినియోగదారులకి మంచి చేసే సర్వీసులు తీసుకోని రావాలి.

Read more about: petrol
English summary

పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి SBI బ్యాంకు బంపర్ ఆఫర్ ఈరోజే లాస్ట్ డేట్ డోంట్ మిస్! | SBI 5 Liters Petrol Free Petrol

State Bank of India is the largest bank in the country. State Bank of India announced a bumper offer for consumers.
Story first published: Saturday, December 15, 2018, 10:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X