For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొన్న ఉల్లిపాయ నేడు ఆలు గడ్డ కేజీ రూ.2 ఎక్కడో తెలుసా?

By girish
|

మొన్న ఉల్లిపాయలు రైతులకు ఉల్లి కన్నీరు తెప్పించింది .పండిన పంటకు కనీస ధర దక్కక రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఉల్లి మార్కెట్‌కు కీలకమైన మహారాష్ట్రలోని నాసిక్‌లో కిలో ఉల్లి కేవలం రూ.50 పైసలు పలకడం అక్కడి రైతుల కష్టాలను అద్దంపడుతోంది. ఓ వైపు పంట దిగుబడి అద్భుతంగా వచ్చిందన్న ఆనందం ఏమాత్రం లేకపోగా మరోవైపు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. క్వింటాల్‌ ఉల్లి సాగుకు రూ.1,100 వరకు ఖర్చయితే, పంటను విక్రయించితే కేవలం రూ.400 వస్తోంది.

మొన్న ఉల్లిపాయ నేడు ఆలు గడ్డ కేజీ రూ.2 ఎక్కడో తెలుసా?

ఈరోజు ఆలుగడ్డ:
ఆలుగడ్డ పండించిన రైతులకు గడ్డు కాలం ఎదురవుతోంది. టోకు మార్కెట్లలో బంగాళదుంప ధరలు దారుణంగా పడిపోతున్నాయి. గోదాముల్లో ఆలుగడ్డలు గుట్టలుగా పోగవడంతో ధర పాతాళానికి చేరుతోంది. ఈ ఏడాది ప్రారంభం రేటుతో పోలిస్తే మూడొంతులు పతనమైంది. సీజన్ చివరకు చేరుతుండటంతో ధరలు పెరుగుతాయనే ఆశతో భారీ ఎత్తున నిల్వ చేసుకున్న టోకు వ్యాపారులకు పెద్ద స్ట్రోకే తగులుతోంది.

కొద్ది వారాలుగా దేశవ్యాప్తంగా ఉన్న హోల్ సేల్ మార్కెట్లలో ఆలుగడ్డలు కిలో రూ.2-3 మాత్రమే పలుకుతోంది. ఇంతకు ముందు కిలో బంగాళదుంప ధర రూ.9-10గా ఉండేది. ఇక ఈ ధరలు పెరుగుతాయన్న ఆశలు కూడా లేవు. ఎందుకంటే మరికొద్ది వారాల్లో కొత్తగా వేసిన పంట మార్కెట్లకు తరలి రానుంది. దీంతో ధరలు మరింత తగ్గుతాయి తప్ప పెరిగే అవకాశమే లేదు. 'కొన్నేళ్ల క్రితం వరకు ధరలు బాగుండటంతో ఆలుగడ్డ రైతులకు బాగానే సంపాదించారు. కానీ స్టోరేజీలో దాచుకున్న రైతులు, వ్యాపారులు నష్టాల పాలవుతున్నారని' ఉత్తరప్రదేశ్ కోల్డ్ స్టోరేజీ అసోసియేషన్ తెలిపింది.

సాధారణంగా కిలో ఆలుగడ్డను రూ.8-12 కొనే టోకు వర్తకులు రూ.18-20కి చిల్లర వ్యాపారులకు అమ్ముతారు. దేశీయ మార్కెట్లో సీజన్ ముగిసే సమయానికి స్టాకు గుట్టలు పేరుకోవడం మామూలే అయినా దాచే సమయానికి పెట్టిన అధిక ధర కారణంగా ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నష్టాల షాక్ ఎక్కువగా కోల్డ్ స్టోరేజీ యజమానులకే తగలనుంది. ఎందుకంటే వాళ్లు రైతులకు 60-70% విలువను రైతులకు అడ్వాన్స్ గా చెల్లించారు.

Read more about: money
English summary

మొన్న ఉల్లిపాయ నేడు ఆలు గడ్డ కేజీ రూ.2 ఎక్కడో తెలుసా? | Potato Kg rs.2

The worst time for farmers grown up Potato prices are falling in wholesale markets. The price of potatoes in the godowns, the price reaches the hell
Story first published: Thursday, December 13, 2018, 17:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X