పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్యుడికి బాదుడు షురూ!

గత కొన్ని వారాల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గుతు వచ్చాయి. దేశంలో అన్ని నగరాలలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వాహనదారులకు ఉపశమనం ఇచ్చాయి. కానీ ఈరోజు నుంచి సామాన్యుడికి మళ్ళీ పెట్రోల్ ధరలతో నడ్డి విరగగొట్టడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఈరోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు దేశం లో వివిధ నగరాలలో ఎలా ఉన్నాయో చూద్దాం.కానీ ఇలా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడానికి కారణాలు కూడా చూడండి.

మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండురోజులుగా స్ధిరంగా ఉన్న పెట్రోల్ ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత పెరిగాయి. డీజిల్ ధర మూడో రోజు కూడా స్థిరంగానే ఉంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 9 పైసలు పెరిగి రూ.70.29 కి చేరగా.. డీజిల్ ధర రూ.64.66 వద్దే కొనసాగుతోంది. ముంబయిలో పెట్రోలు ధర 11 పైసలు పెరిగి రూ.75.91 ఉండగా.. డీజిల్ ధర రూ.67.66 గా ఉంది.

పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్యుడికి బాదుడు షురూ!

కర్ణాటక ఎన్నికల ముందు 20 రోజులపాటు పెట్రోల్ ధరలు పెరగలేదు. మే 12న ఎన్నికలు ముగిశాక 17 రోజుల్లోనే పెట్రోల్ ధర సుమారు నాలుగు రూపాయల మేర పెరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. నిరసనలు వ్యక్తం కావడంతో.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని రూ.1.50 మేర తగ్గించింది. లీటర్‌కు రూ.1 తగ్గించాలని తగ్గించాలని చమురు సంస్థలను కోరింది. తర్వాత అక్టోబర్ 18 నుంచి చమురు ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.

వివిధ నగరాలలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:

నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ ₹ 70.29 ₹ 64.66
ముంబయి ₹ 75.91 ₹ 67.66
కోల్‌కతా ₹ 72.38 ₹ 66.40
చెన్నై ₹ 72.94 ₹ 68.26
బెంగళూరు ₹ 70.86 ₹ 65.00
హైదరాబాద్ ₹ 74.55 ₹ 70.26
విజయవాడ ₹ 74.05 ₹ 69.39

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+