For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్ లైన్ అమ్మకాలు నిలిపేయండి ఢిల్లీ కోర్ట్ ఆదేశాలు!

By girish
|

పాత రోజుల్లో ఏదన్నా కొనాలి అంటే ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీతో కలిసి అన్ని షాపులు తిరిగి మనకి నచ్చినది కొన్నేవాళ్ళం కానీ ఈరోజుల్లో ఏది కొనాలి అంటే ఇప్పుడు మొత్తం ఆన్ లైన్ లో జరిగిపోతోంది.; కేవలం ఒక క్లిక్ తో మన దగ్గరకి అన్ని వచేస్తున్నాయి.బట్టలు అంటే ఏదో మనకి నచ్చింది కొంటాము నచ్చకపోతే వాడడం మానేస్తాం కానీ మెడిసిన్ కూడా ఆన్ లైన్ లో అమ్ముతున్నారు. డాక్టర్ సలహా లేకుండా మెడిసిన్ అమ్మకూడదు అని కోర్ట్ ఆర్డర్ చేసింది.

ఆన్ లైన్ అమ్మకాలు నిలిపేయండి ఢిల్లీ కోర్ట్ ఆదేశాలు!

దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో మెడిసిన్ అమ్మకాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ-ఫార్మసిస్ట్ ల ద్వారా దేశవ్యాప్తంగా జరుగుతున్న అమ్మకాలను నిలుపుదల చేయాలని కేంద్రానికి, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి తెలిపింది. చీఫ్ జస్టిస్ రాజేంద్ర మెనన్, జస్టిస్ వీకే రావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఢిల్లీకి చెందిన డెర్మటాలజిస్ట్ జహీర్ అహ్మద్ ఆన్ లైన్ అమ్మకాలను నిలిపివేయాలంటూ హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. డాక్టర్ల అనుమతి లేకుండా రోజు దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో లక్షల కొద్ది మెడిసిన్ల అమ్మకాలు జరుగుతున్నట్లు న్యాయస్ధానం దృష్టికి తెచ్చారు. ఇలా రోగులు సొంత వైద్యానికి అలవాటు పడితే అనర్ధాలు జరుగుతాయంటూ తెలిపారు. ఆన్ లైన్ లో మెడిసిన్ విక్రయాలకు డ్రగ్స్ అండ్ కాస్మటిక్ యాక్ట్, 1940, ఫార్మసి యాక్ట్ 1948లలో అనుమతిలేదని పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

Read more about: online
English summary

ఆన్ లైన్ అమ్మకాలు నిలిపేయండి ఢిల్లీ కోర్ట్ ఆదేశాలు! | Online Medicine Sale Should Stop

In the old days if we want to to for shopping means friends or family with all the shops that we'd like to get back to. But today what's going on is shoppingwhat's now going on online! With just one click all of us come to us
Story first published: Thursday, December 13, 2018, 10:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X