అమరావతిలో అన్న గారి భారీ విగ్రహం ఏర్పాటు: చంద్రబాబు నాయుడు!

నిన్న కాక మొన్న పటేల్ గారి విగ్రహం ఇప్పుడు ఆంధ్రుల ఆరాద్య దైవం అన్న నందమూరి తారకరామారావు గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో నిర్మించబోతున్నారు దాని విషయాలు తెలుసుకుందాం

అన్న గారి విగ్రహం:

అన్న గారి విగ్రహం:

ఇలా అన్న గారి విగ్రహం ఏర్పాటు పై అనేక ఊహాగానాలు ఇప్పటికే హల్ చల్ చేస్తున్నాయి. అదిఎంటి అంటే నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికలలో ప్రజకూటమి ఓడిపోవడానికి కారణం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక కారణం అని అందరు అనుకుంటున్నారు.

తెలంగాణ ఎన్నికల ప్రభావంతో:

తెలంగాణ ఎన్నికల ప్రభావంతో:

తెలంగాణ ఎన్నికల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మంచి ప్రభావం చూపిస్తున్నాయి. ఎన్నికల ప్రభావం వల్ల తెలుగు దేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కొంచెం పేరు పోవడం నిజమే అని నిపుణులు అంటున్నారు. దానికోసమే ఈ అన్న గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు అని గుసగుసలాడుకుంటున్నారు,

అమరావతి నీరుకొండలోని:

అమరావతి నీరుకొండలోని:

రాజధాని అమరావతి నీరుకొండలోని ఎత్తైన కొండపై టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు భారీ విగ్రహ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కొండపై 32 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంపై 60 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహన్ని నిర్మించనున్నారు. 200 ఎకరాల్లో ఎన్టీఆర్ స్మారక ప్రాజెక్టు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లను చంద్రబాబు పరిశీలించారు. ఎల్‌అండ్‌టీకి చెందిన డిజైన్స్‌ అసోసియేట్స్‌ రూపొందించిన ఆకృతులను ఆయన చూశారు.

ఎన్టీఆర్ స్మారకాన్ని:

ఎన్టీఆర్ స్మారకాన్ని:

ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా, వాణిజ్య కూడలిగాను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వహణకయ్యే ఆదాయాన్ని సొంతంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. విగ్రహ నిర్మాణానికే రూ.155 కోట్లు అవసరమని తేల్చారు. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎన్టీఆర్ స్మారకాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం మరో రూ.112.50 కోట్లు కావాలని అధికారులు తెలిపారు. ఈ మొత్తంలో చాలా వరకూ విరాళాల రూపంలో సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 విగ్రహం లోపలే:

విగ్రహం లోపలే:

నీరుకొండపై నిర్మించనున్న ఎన్టీఆర్ విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విగ్రహం లోపల ఉన్న లిఫ్టుల ద్వారా సందర్శకులు విగ్రహం పైవరకూ వెళ్లి, అక్కడ నుంచి అమరావతిని వీక్షించొచ్చు. విగ్రహం లోపలే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. చుట్టూ వాటర్‌ఫ్రంట్‌, ఆడిటోరియం, ఫెర్రీ, సెల్ఫీ పాయింట్‌, కేఫ్‌, యాంఫీ థియేటర్‌, మినీ ట్రైన్లతోపాటు స్టార్‌ హోటల్‌, షాపింగ్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, రిసార్టులను కూడా నెలకొల్పుతామని తెలిపారు. 46 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎంకు చెప్పారు మూలం ఎన్ టీవీ.

ట్విటర్ లో:

ఈ అన్న గారి విగ్రహం గురుంచి స్వయానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ట్విటర్ లో పేరుగొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+