తెలంగాణ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలిస్తే షాక్
తెలంగాణ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ దారుణమైన ఫలితాలను చూసింది తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం మంది తెలుగు దేశం పార్టీకి మద్దతుదారులు ఉంటారు అని టాక్ ఉంది. ఇక హైదరాబాద్ లో తెలుగు దేశం పార్టీకి తిరుగు లేదు అంటూ అంతా భావించారు.

తెలుగు దేశం పార్టీ:
కానీ తెలుగు దేశం పార్టీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనూహ్యంగా హైదరాబాద్ ఓటర్లు టిఅర్ఎస్ పార్టీకి ముగ్గు చూపారు, అద్భుతమైన మెజారిటీ తో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి పగ్గాలు ఇచ్చారు.

భవ్య క్రియేషన్స్:
ఇక ఈ ఎన్నికలలో తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన ఒక నిర్మాత దారుణంగా ఓడిపోయాడు. భవ్య క్రియేషన్స్ పై చాలా సినిమాలు నిర్మించి తెలుగు ప్రేక్షకులని అలరించిన భవ్య ఆనంద్ ప్రసాద్ ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమలో కూడా పెద్దగా విజయాలు అందుకోలేకపోయారు.

నందమూరి బాలకృష్ణ:
ఇక వ్యాపారంలో భారీ లాభాలు పొందిన ఆనంద్ ప్రసాద్ సినిమాలలో సరదాగా కోట్లు ఖర్చుపెడుతూ వస్తున్నాడు. ఇక నందమూరి బాలకృష్ణ అండదందాలతో హైదరాబాద్ లింగంపల్లి టికెట్ దక్కించుకున్నాడు. తెలుగు దేశం పార్టీ కంచుకోటగా పిలవబడే ఈ లింగంపల్లి లో ఆనంద్ ప్రసాద్ తన విజయం కోసం దాదాపుగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టాడు అని సమాచారం.

కోట్లు ఖర్చు:
ఇక ఈయన ఎంత ఖర్చుపెట్టిన కూడా కారు స్పీడు ముందు నిలవలేకపోయాడు. ఒక వైపు సినిమాలు ప్లాప్ అవుతున్న సమయంలో రాజకీయాలలో తన అదృష్టం పరీక్షించుకుకోవాలి అని అయన అనుకున్నాడు. కానీ అక్కడ కూడా దారుణమైన పరాజయం చూసాడు. రూ.30 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే కనీసం కొంచెం మొత్తమైన వస్తుంది కానీ ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రాదు.

చంద్రబాబు:
ఇక ఈ ఎన్నికలలో మొత్తం సినీ పరిశ్రమ నుండి పోటీ చేసింది ఈయన ఒక్కరే అని సమాచారం. ఈయన దారుణంగా ఓడిపోయాడు . ఎక్కడ ఎక్కువ ఆంధ్రా వాళ్ళు ఉంటారు అని చంద్రబాబు ఆనంద్ ప్రసాద్ గారికి టికెట్ ఇచ్చారు. కానీ తెరాస పార్టీ నుంచి అరికపూడి గాంధీ గారి భారీగా గెలిచారు. మూలం: ఓంఫాట్ ఛానెల్.


Click it and Unblock the Notifications