ఆర్‌బీఐ గవర్నర్‌గా ఐఏఎస్‌ అధికారి శక్తికాంత దాస్‌!

ఆర్‌బీఐ గవర్నర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌ను ప్రభుత్వం నియమించింది. కేంద్ర అపాయింట్స్‌మెంట్‌ కమిటీ ఆప్‌ క్యాబినెట్‌ (ఏసీసీ) శక్తికాంత దాస్‌ను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.శక్తికాంత దాస్ 2015-17 కాలంలో ఎకనామిక్ అఫెయిర్స్ సెక్రటరీగా ఉన్నారు. తమిళనాడు కేడర్ కి చెందిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్(61) రిజర్వ్ బ్యాంక్ 25వ గవర్నర్ కానున్నారు. ఇంతకు ముందు తమిళనాడు ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో శక్తికాంత దాస్ ఆర్థిక విభాగంలో పని చేశారు. మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లని రద్దు చేసినపుడు కూడా శక్తికాంత దాస్ కీలక పాత్ర పోషించారు.

ఆర్‌బీఐ గవర్నర్‌గా ఐఏఎస్‌ అధికారి శక్తికాంత దాస్‌!

పీఎం మోడీ దాస్ ని ఆర్థిక మంత్రిత్వశాఖలోకి తీసుకొచ్చారు. మొదట ఆయన రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అయ్యారు. పెద్దనోట్ల రద్దు సమయంలో 2016లో ఆయన పూర్తి వ్యవహారాలను పర్యవేక్షించారు. ఆయనకు కేంద్ర బ్యాంక్ తో చాలా దగ్గరగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. అలాగే జీ20లో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.డిసెంబర్ 14న రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశం జరగనుంది. ఇందులో గవర్నెన్స్ రిఫార్మ్ పై చర్చ జరిగే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+