For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి దెబ్బకి బెట్టింగ్ రాయుళ్ల కొంప మునిగింది!

By girish
|

తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టిఅర్ఎస్ పార్టీ సింగల్ గా 88 సీట్లు గెలుచుకొని మళ్ళీ ప్రభుత్వం స్థాపించపోతోంది. కానీ ఈ ఫలితాల ముందు ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి చెప్పిన సర్వే చూసి చాలా మంది ఇప్పుడు చేతులు కాల్చుకున్నారు.ఏంటో చూద్దాం.

 ప్రజాకూటమి:

ప్రజాకూటమి:

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి నేతలు చిత్తుగా ఓడిపోవడంతో వారు లోలోపల కుంగిపోతున్నారు. ఇక వీరి ఓటమి వల్ల మరో వర్గం కూడా కుంగిపోయారు.. వారు ఎవరో కాదు బెట్టింగ్ రాయుళ్లు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని కోట్లలో పందాలు కాసిన వారు ఇప్పుడు నిండా మునిగిపోయారు.

ఎగ్జిట్ పోల్స్:

ఎగ్జిట్ పోల్స్:

తెలంగాణ ఎన్నికలపై తెలుగురాష్ట్రాల్లో భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగింది. నిజానికి తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ హడావిడి ఎక్కువగా కనిపించింది. ప్రచారం మొదలైనప్పుడు పందాలు అంతగా లేవు.. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వేలను నమ్ముకుని ఆ తర్వాత మరికొందరు బెట్టింగ్‌లోకి దిగారు.

లగడపాటి రాజగోపాల్:

లగడపాటి రాజగోపాల్:

ప్రధానంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేను గుడ్డిగా నమ్మిన కొందరు ప్రజాకూటమిపై కోట్లలో పందాలు కాశారు. తుది ఫలితాల్లో కూటమి నేతలు చిత్తుగా ఓడిపోయి టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో కోట్లలో పందాలు కాసిన వారు నిండా మునిగిపోయారు.

నందమూరి సుహాసినీ:

నందమూరి సుహాసినీ:

అన్నంటిలోకి కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినీ విజయంపైనే ఎక్కువ శాతం బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ప్రజాకూటమి విజయం సాధిస్తుందని.. ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ఓ వ్యక్తి 5 ఎకరాలు పందెం కాశాడు.

మాజీ ఎమ్మెల్యే:

మాజీ ఎమ్మెల్యే:

అలాగే టీఆర్ఎస్ ఓడిపోతుందని పందెం కాసిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు 10 ఎకరాలు పొగొట్టుకున్నాడు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రూ.5 కోట్లు పందెం కాసి 10 కోట్లు లాభం పొందాడు.

Read more about: money
English summary

ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి దెబ్బకి బెట్టింగ్ రాయుళ్ల కొంప మునిగింది! | Crores Of Rupees Lose Due to Lagadapati Survey on Trs Party

In the early elections of Telangana, the TRS party has won 88 seats and the government is again set up. But before these results, the Andhra Octopus lagatapati survey showed that many people have now shot their hands. Let's see.
Story first published: Wednesday, December 12, 2018, 13:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X