నేడు దేశంలో రాజస్థాన్, ,మధ్యప్రదేశ్, చత్తిస్గడ్ మరియు తెలంగాణలో ఎన్నిలకల ఫలితాలు విడుదల కాబోతున్న సంధర్భంలో షేర్ మార్కెట్ పడుతూ లేస్తూ ఉంది, కానీ నిన్న మార్కెట్ మాత్రం బాగాపడిపోయింది. ఈరోజు కూడా అలాగే ఉంది,
అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ రాజకీయ పరిస్థితులకు స్టాక్ మార్కెట్ ప్రతికూలంగా స్పందించింది. ముడి చమురు ధరలు భారీగా క్షీణించినా... అంతర్జాతీయ మార్కెట్ల పతనంతో రూపాయి ఏకంగా 60 పైసలకు పైగా బలహీనపడింది. ఉదయం ఏకంగా 180 పాయింట్లకు పైగా నష్టంతో ఓపెనైన నిఫ్టి రోజంతా అదే స్థాయిలో ఊగిసలాడింది. ఏ స్థాయిలోనూ మార్కెట్‌కు మద్దతు అందలేదు. మిడ్ సెషన్ తర్వాత యూరో మార్కెట్లూ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే నష్టాలు మరీ తీవ్రంగా లేకపోవడంతో నిఫ్టి మరింత పతనం కాకుండా 205 పాయింట్ల నష్టంతో 10,500 దిగువ 10488 వద్ద ముగిసింది.

మరోవైపు సెన్సెక్స్ కూడా 713 పాయింట్లు క్షీణించింది. ముడి చమురు ధరలు ఇవాళ ఒక శాతంపైగా క్షీణించాయి. దేశీయ రాజకీయ పరిణామాలు కూడా మార్కెట్ పతనానికి దోహదపడ్డాయి. రేపు వెల్లడికానున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మార్కెట్ అప్పుడే డిస్కౌంట్ చేయడం ప్రారంభించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో కూడా బీజేపీ ఓటమిని మార్కెట్ డిస్కౌంట్ చేస్తోందని కొందరు మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
మోడీ పగ్గాలు చేపట్టిన తరవాత అధికార పక్షానికి కీలక ప్రాంతాల్లో ఎదురుదెబ్బ తగలనుందని వీరు అంటున్నారు. నిఫ్టిలో కేవలం 5 షేర్లు మాత్రం లాభాలతో ముగిశాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌తో పాటు కోల్ ఇండియా, మారుతీ షేర్లు లాభాలతో ముగిశాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో కొటక్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు ముందున్నాయి. బ్యాంకులో యజమాని వాటా తగ్గించుకోవడానికి సంబంధించి ఆర్‌బీఐకి, బ్యాంక్ మధ్య గొడవ మొదలైంది. ఆర్బీఐ ఆదేశాలపై కొటక్ బ్యాంక్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది.


Click it and Unblock the Notifications