For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్లో మొదలు కానున్న భారీ హోటల్ ఎక్కడ తెలుసా?

By girish
|

రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ అప్పుల తో బయటకు వచ్చింది కనీసం రాజధాని కూడా లేదు,గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది దేశ విదేశాలనుండి ఎన్నో పరిశ్రమలు ఐటి కంపెనీలు హైదరాబాద్ కి క్యూ కట్టాయి తద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది.ఇక రాష్ట్రం విడిపోయాక మొత్తం కంపెనీలు అన్ని హైదరాబాద్ లో ఉండిపోయాయి

కియా:

కియా:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ పరిశ్రమ దేశంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో ఏర్పాటు చేసింది.అనంతపురం జిల్లాలోని పెనుగొండ మండలం యర్రంచీ గ్రామంలో కంపెనీ తన అతిపెద్ద ఉత్పాదన కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. కియా ఇప్పటికే దాని తయారీ కేంద్రంలో $ 1.1 బిలియన్లు

పెట్టుబడి పెట్టింది, మరియు ఇది తుది దశలో ఉంది.

ఆసియా పల్ప్ పేపర్ గ్రూప్ :

ఆసియా పల్ప్ పేపర్ గ్రూప్ :

ఇండోనేషియాకు చెందిన అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజం ఆసియా పల్ప్ పేపర్ గ్రూప్ అనుబంధ సంస్థ సీనార్మాస్ గ్రూప్ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లాలో పరిశ్రమను స్థాపించనుంది.ఈ సంస్థ రెండు దశల్లో రూ.21,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

నోవాటెల్ గ్రూప్:

నోవాటెల్ గ్రూప్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయింది. ప్రఖ్యాత నోవాటెల్ గ్రూప్ విజయవాడలో నిర్మించిన హోటల్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. నోవాటెల్ గ్రూపు దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఈ హోటల్ ను నిర్మించింది. ఈ హోటల్ ను పర్యావరణ హితంగా, తక్కువ కాలుష్యం వెదజల్లేలా ఏర్పాట్లు చేశారు.

అమరావతిలోని:

అమరావతిలోని:

ఈ విషయమై నోవాటెల్ ప్రతినిధులు మాట్లాడుతూ..అమరావతిలోని ఉద్ధండరాయుని పాలెం వద్ద రూ.40 కోట్ల వ్యయంతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడలో నోవాటెల్ మరో సరికొత్త ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Read more about: andhra pradesh
English summary

ఆంధ్రప్రదేశ్లో మొదలు కానున్న భారీ హోటల్ ఎక్కడ తెలుసా? | Novotel Hotel Coming in Andhrapradesh

Andhra Pradesh is not even the capital, after the break up of the state. For the last few decades, the Hyderabad-Andhra Pradesh capital has grown so much that many industries have been queuing up to Hyderabad and several lakh people have been employed.
Story first published: Tuesday, December 11, 2018, 15:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X