లగడపాటి భార్య తాజా సర్వే విడుదల కానీ... లగడపాటి ఎక్కడ?
రాజకీయ అంశాల పట్ల ఉన్న ఆసక్తి, అవగాహన మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌కు 55 నుంచి 70 సీట్ల వరకు గెల్చుకుంటుందన్న అభిప్రాయం ఏర్పడిందని లగడపాటి రాజగోపాల్ సతీమణి జానకి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి విజయావకాశాలు ఉంటాయనేదానిపై తాను స్వంతంగా, స్వతంత్రంగా ఒక అంచనాకు వచ్చానని, కాంగ్రెస్‌కు 35 సీట్లు, కూటమిలోని తెలుగుదేశం పార్టీకి ఐదు నుంచి ఏడు సీట్లు వస్తాయని తన లెక్క ప్రకారం తేలిందని ఆమె పేర్కొన్నారు. బిజెపి నాలుగు సీట్ల వరకు వస్తాయని, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
ఊహకు అందని తీరులో ఈసారి ఎన్నికల్లో కొద్దిమంది అభ్యర్థులు గెలుస్తారని, ప్రముఖులుగా గుర్తింపు పొందిన సీనియర్ నాయకులు పలువురు ఓడిపోతారని పేర్కొన్నారు. ఓడిపోయేవారిలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనని పేర్కొన్నారు. కూటమి ఏర్పాటులో చంద్రబాబు పాత్ర చాలా కీలకంగా ఉందని, కొత్త ఉత్సాహం రావడానికి కూడా ఆయనే కారణమని పేర్కొన్న జానకి తెలుగుదేశం ఓట్లను కాంగ్రెస్‌వైపు, కూటమివైపు తిప్పడంలో ప్రముఖ పాత్ర పోషించారని గుర్తుచేశారు. అయితే అదే సమయంలో తెలంగాణలో సెంటిమెంట్లు మళ్ళీ తెరపైకి రావడానికి కూడా చంద్రబాబే కారణమయ్యారని, తెలంగాణ ప్రజలు ఈ నాలుగేళ్ళలో మర్చిపోయిన సెంటిమెంట్ ఒక్కసారిగా ఆయన రోడ్‌షోలు, బహిరంగసభలు, ఎన్నికల ప్రచారంతో ప్రజల మనసుల్లోకి వచ్చాయని వ్యాఖ్యానించారు.

తన భర్త లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే పట్ల తనకు విశ్వాసం ఉందని, అయితే ఆయన సర్వే అంచనాలను సవాలు చేసేంత ధైర్యం మాత్రం లేదని అన్నారు. అయితే రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తిని చూసిన తర్వాత టిఆర్‌ఎస్‌కు గరిష్టంగా 70 సీట్ల వరకు వస్తాయన్న నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఓటు వేయడానికి వచ్చిన మహిళలు, వృద్ధులు, మురికివాడల్లోని నిరుపేదలు, ముస్లిం మైనారిటీ యువతులను చూసిన తర్వాత ఓటు వేయడంలో వారి ముఖాల్లో వారి భావోద్వేగాలను గమనించానని, చాలా ఉత్సాహం, నూతనత్వం కనిపించిందని పేర్కొన్నారు. ఓటు వేయడం కోసం క్యూలో నిల్చున్న మొదటిసారి ఓటు వేసే యువత ముఖాల్లోని ఫీలింగ్స్‌ను కూడా చూశానని, కానీ పెద్దగా ఉత్సాహం కనిపించలేదని పోలికను వివరించారు.


Click it and Unblock the Notifications