For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకి కేంద్రం బంపర్ ఆఫర్.. ఎలక్షన్స్ ఎఫెక్ట్!

By girish
|

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం నుంచి మరో శుభవార్త మరోసారి ప్రభుత్వం వారి ప్రయోజనాలకు మంచి జరిగే ఒక నిర్ణయం తీసుకొంది.అది ఏంటో తెలుసా? . ప్రభుత్వ ఉద్యోగులకు ఒక బహుమతి ఇచ్చారు. గురువారం కేబినెట్ జాతీయ పింఛను వ్యవస్థలో 14 శాతం ప్రభుత్వ నిధులు సమకూర్చింది. ఇది ప్రస్తుతం 10 శాతం.ఉంది.

ఉద్యోగులకి కేంద్రం బంపర్ ఆఫర్.. ఎలక్షన్స్ ఎఫెక్ట్!

జాతీయ పింఛన్ పథకానికి (నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌) ప్రభుత్వ సహకారాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందించే సహకారాన్ని 14 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం (డిసెంబర్ 10) ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. దీంతోపాటు పదవీ విరమణ సమయంలో విత్‌డ్రా చేసుకునే పింఛను డబ్బుకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

ప్రస్తుతం పింఛను పథకానికి కేంద్రం 10 శాతం అందిస్తోంది. దీన్ని మరో 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గత వారంలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో చర్చ జరిగింది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.2,840 కోట్ల భారం పడనుంది.

ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా తాము ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. ఎన్‌పీఎస్‌లో ప్రస్తుతం ఉద్యోగులు 60 శాతం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణ సమయంలో విత్‌‌డ్రా చేసుకునే డబ్బుకు పన్ను మినహాయింపు ఇస్తున్నామని, ఇది అన్ని వర్గాల ఉద్యోగులకు వర్తిస్తుందని జైట్లీ తెలిపారు.

Read more about: modi
English summary

ఉద్యోగులకి కేంద్రం బంపర్ ఆఫర్.. ఎలక్షన్స్ ఎఫెక్ట్! | Government Makes NPS Withdrawal 100% tax Exempt

NPS on withdrawal will be totally tax exempt. Currently, 40% of the total accumulated corpus utilised for purchase of annuity at retirement or reaching the age of 60 is already
Story first published: Tuesday, December 11, 2018, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X