For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కే.జి. ఎఫ్ ప్రీ-బిజినెస్ వెనుక ఉన్న వ్యక్తి టాప్ డైరెక్టర్!

By girish
|

యశ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు - తమిళం - కన్నడ - మలయాళం - హిందీలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బిజినెస్ డీల్:

బిజినెస్ డీల్:

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా - హిందీ - కన్నడలో బిజినెస్ డీల్ పూర్తయిందని తెలుస్తోంది. `బాహుబలి` తర్వాత మళ్లీ అంత భారీ కాన్వాసుతో తెరకెక్కుతున్న చిత్రంగా ప్రచారమవుతున్న ఈ సినిమాని నిర్మాతలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రిలీజ్ చేస్తున్నారట.

ఎస్.ఎస్.రాజమౌళి:

ఎస్.ఎస్.రాజమౌళి:

అయితే ఈ సినిమా ప్రీబిజినెస్ కి సాయమందించింది ఎవరో తెలుసా? సాక్షాత్తూ `బాహుబలి` దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అని తెలుస్తోంది. ఇటు తెలుగు రైట్స్ - అటు హిందీ రైట్స్ అమ్మకానికి రాజమౌళినే సాయం చేశారట. తనకు అత్యంత సన్నిహితుడు అయిన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటికి రికమండ్ చేసింది రాజమౌళినే. అటుపై ముంబై డిస్ట్రిబ్యూటర్ అనీల్ తడానీకి కేజీఎఫ్ ని రికమండ్ చేసింది రాజమౌళినే. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో వెల్లడించారు.

ఆర్.ఆర్.ఆర్:

ఆర్.ఆర్.ఆర్:

అసలు కేజీఎఫ్ టీమ్ తో తనకు ఎలా పరిచయమైందో చెబుతూనే ఆ సినిమా విజువల్స్ కి స్పెల్ బౌండ్ అయిపోయి తానే అన్నిటికీ సాయపడ్డానని తెలిపారు రాజమౌళి. జక్కన్న మాట్లాడుతూ-``ఏప్రిల్ లో బెంగళూర్ - తాజ్ లో ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి కథా చర్చలు చేశాను. ఆ టైమ్ లో అదే హోటల్లో యశ్ కూడా ఉన్నాడు. రెండు నిమిషాలు టైమ్ అడిగి కేజీఎఫ్ విజువల్స్ ని నాకు చూపించారు. తొలిసారి చూసి బ్లో అయిపోయాను. విజువల్స్ కి క్వాలిటీకి మైమరిచిపోయాను

 కేజీఎఫ్ విజువల్స్:

కేజీఎఫ్ విజువల్స్:

పెద్ద పెద్ద సినిమాలు - హాలీవుడ్ సినిమాల్ని వీళ్లు కాపీ కొట్టి తీయలేదు. పూర్తిగా ఒరిజినల్ విజువల్స్ చూపించారు. 3 సంవత్సరాలు ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. విజువల్స్ చూడగానే పాన్ ఇండియా సినిమా చేయగలిగారనిపించంది. ఒక రీజన్ కి కట్టుబడి - గొప్ప కథతో మాత్రమే పాన్ ఇండియా సినిమా తీయాలి డబ్బు పెట్టుబడి పెడితే పాన్ ఇండియా సినిమా తీయలేం. యూనివర్శల్ సినిమా తీయలేం. కేజీఎఫ్ లో పాన్ ఇండియా అప్పీల్ ఉంది.. అందుకే ముంబై అనీల్ తడానీకి ఫోన్ చేసి .. కేజీఎఫ్ విజువల్స్ చూశాను.. నచ్చింది.. మీరూ చూడండి అని చెప్పాను. ఇక్కడ తెలుగులో శోభు - సాయి కొర్రపాటిలకు చెప్పాను`` అని తెలిపారు.

 కన్నడ సినిమాలా కాకుండా:

కన్నడ సినిమాలా కాకుండా:

కేజీఎఫ్` కేవలం కన్నడ సినిమాలా కాకుండా పాన్ ఇండియా మూవీగా రిలీజవుతోంది. అలాంటి మంచి విజువల్స్ రావాలంటే జస్ట్ డబ్బులు పెడితేనో - హీరో డేట్స్ ఇస్తేనో రావు.. పూర్తిగా టీమ్ కావాలి. ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని గొప్పతనం తెలుగు ప్రజలకు ఉంది. సినిమా నచ్చితే మనవాళ్లు ఏ భాష నుంచి వచ్చింది అని చూడకుండా ఆదరిస్తారు. నా ప్రజల విషయంలో గర్వంగా ఉన్నాను. ఈ విజువల్స్ చూశాక తెలుగు రాష్ట్రాల్లోనూ - ఇండియాలోనూ బాగా ఆడుతుందని నమ్ముతున్నా..అని రాజమౌళి అన్నారు.

Read more about: business
English summary

కే.జి. ఎఫ్ ప్రీ-బిజినెస్ వెనుక ఉన్న వ్యక్తి టాప్ డైరెక్టర్! | KGF Movie Pre-Business

Yash's big budget movie 'KGF' is being released worldwide on 21st of this month. The film is being released in five languages. Telugu - Tamil - Kannada - Malayalam - is preparing for the biggest release in Hindi.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X