ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు.మాములుగా ఉల్లి కొస్తే మన కంటిలో నీరు వస్తాయి కానీ ఒకప్పుడు ఈ ఉల్లి కొనాలి అంటే కంట్లో నీరు వచ్చేది అంత ఎక్కువ ధర ఉండేది కానీ ఈరోజు వచ్చేసరికి పండించిన రైతులకి ఉల్లి ధర చూసి పడిన శ్రమంతా బూడిదలో పనీరు పోసిన్నట్లు అయిపోయింది.
రైతులకు ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. పండిన పంటకు కనీస ధర దక్కక రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఉల్లి మార్కెట్‌కు కీలకమైన మహారాష్ట్రలోని నాసిక్‌లో కిలో ఉల్లి కేవలం రూ.50 పైసలు పలకడం అక్కడి రైతుల కష్టాలను అద్దంపడుతోంది. ఓ వైపు పంట దిగుబడి అద్భుతంగా వచ్చిందన్న ఆనందం ఏమాత్రం లేకపోగా మరోవైపు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. క్వింటాల్ ఉల్లి సాగుకు రూ.1,100 వరకు ఖర్చయితే, పంటను విక్రయించితే కేవలం రూ.400 వస్తోంది.

మరోవైపు మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గడిచిన ఏడేళ్లలో ఉల్లి ధర ఈ స్థాయిలో పతనమవటం ఇదే తొలిసారి. ధరలు కుదేలవడంతో రైతులు నష్టపోతున్నా దళారులు మాత్రం లాభపడుతున్నారు. రైతుల నుంచి కిలో ఉల్లి 50 పైసలకు కొనుగోలు చేసిన స్టాకిస్టులకు రూ.8కి విక్రయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మహారాష్ట్రలో మొన్నటికి మొన్న ఓ ఉల్లిరైతు 750 కిలోల ఉల్లిపాయలను కేవలం రూ. 1,064కు విక్రయించారు. తీవ్ర నిరాశకు గురైన రైతు ఆ మొత్తాన్ని ప్రధానమంత్రికి మనియార్డర్ చేసి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications