For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మంచి బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం!

By girish
|

ఈరోజుల్లో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే ఎంతో కష్టపడాలి అలాగే ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే చాలా కష్టం దానికి కారణం ఎక్కువ చదువుకున్నారు ప్రతి సంవత్సరం కాలేజీల నుంచి బయటకి వస్తున్నారు. ఇక తాజాగా రాస్తారం విడిపోయాక నవ్యంధ్ర ప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది ఏంటో చూద్దాం.

ఏపీలో నిరుద్యోగులకు మంత్రి కొల్లు రవీంద్ర మరో గుడ్ న్యూస్ తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితో పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర అధికారికంగా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మంచి బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం!

గురువారం రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ.4లక్షలకు పైగా అర్హులకు ప్రతి నెలా రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల 74వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

నిరుద్యోగ భృతి అందుకుంటున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీ నుంచి 555 కేంద్రాల్లో సిల్క్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. దీని కోసం రూ.24 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ పొందాలనుకునే నిరుద్యోగులంతా ముఖ్య మంత్రి యువనేస్తం పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారికి ఏ విభాగంలో ఆసక్తి అంటే అందులో ట్రైనింగ్ ఇస్తామని మంత్రి వివరించారు.

Read more about: andhra pradesh
English summary

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మంచి బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం! | Good News to Unemployed People in Andhrapradesh

Minister for Education Kollu Ravindra told the Good News. Special training will be given to unemployed people in the state as well as unemployment benefits. Minister Kovil Ravindra officially announced this.
Story first published: Friday, December 7, 2018, 16:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X