For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జన్ ధన్ యోజన్ పథకంలో బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా లాభాలు ఉన్నాయి తెలుసా?

By girish
|

ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'జన్ ధన్ యోజన' పథకం పెద్ద సక్సెస్ అయింది. ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద తక్కువ సమయంలో గరిష్ఠ సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయి.

 జన్ ధన్ యోజన:

జన్ ధన్ యోజన:

ఐదు నెలల్లో 11.5 కోట్ల బ్యాంకు ఖాతాలను జన్ ధన్ యోజన కింద తెరిచారు. ఈ పథకం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించుకోవడం విశేషం. అసలు జన్ ధన్ యోజన్ కింద బ్యాంక్ ఖాతాలను తెరవడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.

ఇన్సూరెన్స్:

ఇన్సూరెన్స్:

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ కింద బ్యాంక్ ఖాతాను తెరిస్తే... కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ని అందిస్తుంది. పేద, మధ్య తరగతి వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఇన్సూరెన్స్‌ని అందించడం విశేషం. ప్రమాదవశాత్తు భీమా కవరేజి కింది సుమారు రూ. 1 లక్ష వరకు ఇన్సూరెన్స్ భీమా సౌకర్యం ఉంది.

ఎలాంటి బ్యాలెన్స్:

ఎలాంటి బ్యాలెన్స్:

ప్రధాని మంత్రి జన్ ధన్ యోజన్ పథకం‌లో ఎలాంటి బ్యాలెన్స్ అక్కల్లేదు బ్యాంకుల్లో సాధారణం సేవింగ్స్ ఖాతా ఉండాలంటే బ్యాంకులు కస్టమర్ల వద్ద నుంచి మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిందిగా సూచిస్తుంటాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ కింద రూ. 5000 నుంచి రూ. 10,000 వరకు ఉంచాలి. అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 500 నుంచి రూ. 1000 వరకు ఉంచాలి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా ప్రారంభించబడిన ఖాతాల విషయంలో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు.

 లైఫ్ ఇన్సూరెన్స్ కవర్:

లైఫ్ ఇన్సూరెన్స్ కవర్:

రూ. 30,000 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ప్రధాని మంత్రి జన్ ధన్ యోజన్ పథకం‌ కింద ఓపెన్ చేసిన ఖాతాలకు రూ. రూ. 30,000 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజిని అందిస్తుంది. నగదు డైరెక్టుగా ఖాతాలోకే బదిలీ అవుతుంది: ఈ పథకం ద్వారా తెరిచిన ఖాతాల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వచ్చే నగదు బదిలీలుగా డైరెక్టుగా తమ వారి ఖాతాల్లోకి జమ చేయడానికి వీలవుతుంది. బ్యాంక్‌ ఖాతాల వల్ల మహిళల కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదుగుతుంది. డబ్బు దుర్వినియోగం కాకుండా ఉంటుంది. ఈజీగా నగదు బదిలీ: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ పథకం కింద బ్యాంకు ఖాతా తెరిచిన కస్టమర్లు ఈజీగా నగదుని బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ:

ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ:

ముఖ్యంగా ఇది పేద, మధ్య తరగతి వారికి ఎంతో ఉపయోగపడనుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఈ పథకం కింద ఓపెన్ చేసిన ఖాతాలకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎమర్జెన్సీ సమయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ సదుపాయన్ని ఆరు నెలలు విజయవంతంగా బ్యాంకు ఖాతాలో లావాదేవీలు నిర్వహించిన తర్వాతే అందిస్తున్నారు. ఇతర ఆర్ధిక ఉత్పత్తులను పొందే అవకాశం: పెన్షన్, ఇతర ఇన్సూరెన్స్ ఉత్పుత్తులను పొందేందుకు ఈ బ్యాంకు ఖాతాలో అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ పథకం అంటే ఏమిటి?

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ పథకం అంటే ఏమిటి?

ప్రతి కుటుంబానికి బ్యాంక్‌ ఖాతా ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా ప్రజలు ముఖ్యంగా పేదలు వారి కష్టార్జీతాన్ని బ్యాంక్‌ ఖాతాలలో పొదుపు చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదుగుటకు వీలు కలుగుతుంది. అంతేగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న అభివృద్ది, సంక్షేమ ఫలాల లబ్దిని నేరుగా వారి ఖాతాలలోకి జమ చేయడానికి వీలవుతుంది. దీని ద్వారా ప్రభుత్వం చెబుతున్నట్లుగా అవినీతిని పారద్రోలడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్యాంక్‌ ఖాతాలు మహిళల పేరున ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదుగుతుంది. డబ్బు దుర్వినియోగం కాకుండా ఉంటుంది. దేశంలోని 120 కోట్ల జనాభాలో 90 శాతం పేద వారే ఉన్నారని, బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించడం ద్వారా పేద వారితో పాటు బ్యాంక్‌లకు, రైతులకు ఆర్థిక స్వావలంభన కలుగుతుంది

Read more about: modi
English summary

జన్ ధన్ యోజన్ పథకంలో బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా లాభాలు ఉన్నాయి తెలుసా? | Benefits of Jan Dhan Yojana

The 'Jan Dhan Yojana' scheme, which was launched by Prime Minister Narendra Modi, has been a big success. The scheme, launched with the intention of having a bank account for each family, Maximum number of bank accounts started under this scheme.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X