ఈరోజుల్లో ప్రతి ఒకరికి బ్యాంకు అకౌంట్ ఉంటుంది అది చదువుకునేవారుకైయినా లేదా చదువు లేని వారికైనా సరే బ్యాంకు అకౌంట్ కచ్చితంగా ఉంటుంది. ఆలా బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి మేము చెప్పబోయే వార్త చేదు వార్త ఏంటో తెలుసా?

జి ఎస్ టి చార్జీలు:
ఇప్పటికే అనేక చార్జీలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు ఇప్పుడు సామాన్యుడి నెత్తిపైకి మరో బాండ రాయి వేయనుంది. అది ఏంటి అంటే బ్యాంకింగ్ మరియు జి ఎస్ టి చార్జీలు కస్టమర్ల పైకి వేయనున్నాయి. మినిమం బాలన్స్ మైంటైన్ చేస్తున్నవారికి అందించే ఉచిత సేవలు పై కూడా జి ఎస్ టి వేస్తున్నట్లు సమాచారం.

క్రెడిట్ కార్డు మంజూరు:
దీని అర్థం ఏంటి అంటే ఇక పై కస్టమర్ల బ్యాంకులు అందించే సేవల పై చార్జీలు విధిస్తారు అని అర్ధం. ప్రధానంగా చెక్ బుక్ జారీ, క్రెడిట్ కార్డు మంజూరు, ఎటిఎం వాడకం ఫ్యూయల్ రిఫండ్ వంటి సేవలపై ప్రభుత్వం జి ఎస్ టి విధించనుంది.

ఎస్ బి ఐ
దీని ద్వారా దాదాపు బ్యాంకుల నుంచి రూ.40 వేల కోట్లను టాక్స్ రూపంలో ప్రభుత్వం వసూల్ చేయనుంది. ఇక రెండు నెలనెలా క్రితం ట్యాక్ డిపార్ట్మెంట్ బ్యాంకులు ఇస్తున్న ఉచిత సర్వీసుల పై జి ఎస్ టి విధింపు పై బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. దింతో ఎస్ బి ఐ , ఐసిఐసిఐ ,హెచ్ డి ఎఫ్ సి ,బ్యాంకులు జి ఎస్ టి బాదుడుకు సిద్ధంగా ఉన్నాయి అని ఎకనామిక్స్ టైమ్స్ విధించింది.

18 శాతం:
దింతో దేశంలో ఉన్న మేజర్ బ్యాంకులు 18 శాతం జి ఎస్ టి విధింపుకు తమ సమ్మతిని తెలియజేశాయి అని సమాచారం అయితే ఇంకా ఎంత జి ఎస్ టి విధించాలి అని బ్యాంకులు ఇంకా చేర్చిస్తున్నాయి అని సమాచారం. అలాగే చాలా బ్యాంకులు ఈ డిసెంబర్ నుంచి జి ఎస్ టి బాదుడు చేయడానికి సిద్ధం అవుతున్నాయి అని ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ సీఈఓ కే.జి.కణ్ణన్ పేరుగొన్నారు.

నాన్-బ్యాంకింగ్
ఈ విధానం అమలు లోకివస్తే ప్రజల పన్ను చెల్లింపులు అని నేరుగా ప్రభుత్వానికి వెళ్లిపోతాయి అని అభిప్రాయపడ్డారు. సి జి ఎస్ టి చట్టంలోని షేడ్యూల్ 2 ప్రకారం ఇతర నాన్-బ్యాంకింగ్ రంగాలలో కూడా జి ఎస్ టి పన్ను పై ఆదాయపు శాఖ కసరత్తులు చేసింది.

సిటీ బ్యాంకు:
ఇక ఈ నోటీసులు అందుకున్న బ్యాంకులలో అంతర్జాతీయ బ్యాంకులైన డి బి ఎస్ బ్యాంకు, సిటీ బ్యాంకు కూడా ఉన్నాయి. చూడాలి ఇక ఎన్ని బ్యాంకులు ఈ లిస్టులోకి వస్తాయో ఈ రూల్ బ్యాంకులు మొదలు పెడితే సామాన్యుడి నడ్డి విరగడం పక్క మూలం: వి ట్యూబ్.