శుక్రవారం దేశీయ వంటగ్యాస్ ధర రూ. 6.52 రూపాయల చొప్పున పన్ను ఆధారంగా తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
శుక్రవారం దేశీయ వంటగ్యాస్ ధర రూ. 6.52 రూపాయల చొప్పున పన్ను ఆధారంగా తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. 14.2 కిలోల సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్ రూ. 507.42 రూపాయలు ఉండగా ప్రస్తుతం తగ్గిన ధరలు తరువాత రూ.500.90 రూపాయల ధర ఉన్నట్టు ఐఒసి తెలిపింది. తగ్గిన ధరలు నిన్న అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్ నుండి ఇప్పటివరకు ఆరుసార్లు వరుసగా వంట గ్యాస్ ధరలు పెంచగా తాజాగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సబ్సిడైజ్డ్ ఎల్పిజి రేట్లు చివరగా గతనెల నవంబర్ 1 న రూ.2.94 రూపాయల చొప్పున పెరిగింది.

రూపాయి విలువ బలపడటం
రూపాయి విలువ బలపడటం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో ఎల్పిజి ధరలు భారీగా తగ్గినట్టు ఐఒసి వెల్లడించింది సబ్సిటీ ఇతర సిలిండర్ పై రూ.133 రూపాయలు తగ్గిస్తున్నట్టు తెలిపింది.ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ రూ. 809.50 రూపాయల మార్కెట్ ధర వద్ద ఇంధన కొనుగోలు చేయవచ్చు.అయితే వినియోగదారులకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా సబ్సిడీ మొత్తాన్ని అందజేయడం ద్వారా ప్రభుత్వం ప్రతి సంవత్సరం 14.2 కిలోల గల 12 సిలిండర్లను ప్రతి కుటుంబానికి సబ్సిడీ కింద అందజేస్తుంది.

సబ్సిడీ
సగటు సరాసరి బెంచ్మార్క్ ఎల్పిజి రేటు మరియు విదేశీ మారకం రేటులో మార్పుల ఆధారంగా ఈ సబ్సిడీ మొత్తం ప్రతి నెలా మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ రేట్లు పెరిగినప్పుడు, ప్రభుత్వం అధిక రాయితీని అందిస్తుంది మరియు ధరలు దిగువకు వచ్చినప్పుడు, సబ్సిడీ కట్ అవుతుంది.

పన్ను నిబంధనల ప్రకారం
పన్ను నిబంధనల ప్రకారం, ఎల్జిజిపై జిఎస్టి ఇంధన మార్కెట్ రేట్లో లెక్కించాలి. ప్రభుత్వం ధరలో కొంత భాగం సబ్సిడీని ఎంచుకోవచ్చు కానీ పన్ను మార్కెట్ రేట్లు ఆదరంగా చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల, మార్కెట్ ధర లేదా సబ్సిడైజ్డ్ ఎల్పిజి ధర తగ్గుదలతో సబ్సిడీ వంట ఇంధనంపై పన్ను సంభవం తగ్గుముఖం పట్టి ధరల తగ్గింపుకు దారితీసింది.

నగదు చెల్లింపు
దీని ప్రకారం, దేశీయ ఎల్పిజి రీఫిల్ కొనుగోలుకు వినియోగదారుడికి ముందస్తు నగదు చెల్లింపు లో భాగంగా రు .133 రూపాయలు ప్రతి సిలిండర్ పై తగ్గిపోతుంది, అనగా మునుపటి సిలిండర్ ధర రూ .942.50 నుండి తగ్గి ప్రస్తుతం రూ .809.50 రూపాయలకు లభిస్తుంది ఇది డిసెంబరు, 2018 నుండి ఢిల్లీ మార్కెట్లో అమల్లో ఉంటుందని ఐఒసి పేర్కొంది.

బ్యాంకు ఖాతాలలో
సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులకు డిసెంబరు నెలలో వారి బ్యాంకు ఖాతాలలో సిలిండర్ సబ్సిడీ కింద రూ. 308.60 రూపాయలు జమచేయబడుతుంది. కస్టమర్ యొక్క బ్యాంకు ఖాతాలో రాయితీ బదిలీ నవంబర్లో రూ. 433.66 రూపాయల నుండి తగ్గించింది.


Click it and Unblock the Notifications