For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లాష్ ఫ్లాష్ కేవలం రూ.2 కే ఇంటర్ నెట్ డేటా మీరే చూడండి.

By girish
|

జియో వచ్చాక టెలికాం రంగంలో భారీ మార్పులు జరిగాయి ఒక కాలింగ్ ఆఫర్లు కాదు ఇంటర్ నెట్ సేవలు మెసేజీలు అన్ని అపరిమితంగా ముకేశ్ అంబానీ ఇచ్చాడు. ఈ ఆఫర్లు చూసి మిగతా టెలికాం కంపెనీలు కూడా భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి.

ముఖ్యంగా, రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ డేటా చార్జీలు గణనీయంగా తగ్గిపోవడమేకాకుండా, అన్ని టెలికాం కంపెనీలు పోటీపడి మొబైల్ డేటాను తక్కువ ధరలకే అందుజేస్తున్నాయి.

ఫ్లాష్ ఫ్లాష్ కేవలం రూ.2 కే ఇంటర్ నెట్ డేటా మీరే చూడండి.

ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ టెలిమ్యాటిక్స్ సంస్థ (సీడాట్) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెల్‌ ఫోన్లలో అత్యవసరంగా మొబైల్ డేటా అవసరమైన పక్షంలో తక్షణం రూ.2కే మొబైల్ డేటా పొందే సౌలభ్యాన్ని కల్పిస్తుంది.

ఇందుకోసం ఈ సంస్థ పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ) వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ద్వారా రూ.2 నుంచి రూ.20 వరకు డేటా అవసరమనుకున్న వారికి క్షణాల్లో అందుతుంది. ఈ సేవలను గురువారం దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో ప్రారంభించారు. ఈ మొబైల్ డేటా పొందేందుకు పబ్లిక్ ఎలక్ట్రానిక్ ఆఫీస్ (పీఈఓ)లను ఏర్పాటు చేయనుంది. వీటిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తారు.

ఈ పీఈఓలలో రూ.2 నాణెం వేయదగినట్టుగా కాయిన్ బూత్ వంటి పరికరం ఉంటుంది. ఇందులో రూ.2 నాణెం వేసి మొబైల్ నంబరును ఎంటర్ చేసినట్టయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అందులో ఎటర్ చేస్తే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలతో పాటు తక్కువ ధరలకే డేటాను అందివ్వనున్నట్టు సీడాట్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

Read more about: jio
English summary

ఫ్లాష్ ఫ్లాష్ కేవలం రూ.2 కే ఇంటర్ నెట్ డేటా మీరే చూడండి. | Internet Data For Rs.2 Rupees

In particular, mobile telecommunication charges are significantly reduced after Reliance Geo services are available, all telecom companies compete and receive mobile data at lower prices.
Story first published: Friday, November 30, 2018, 13:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X